జాతీయ విద్యావిధానం ముసాయిదాపై చర్చ


Mon,August 12, 2019 03:28 AM

రెడ్డికాలనీ, ఆగస్టు 11: జాతీయ విద్యావిధానం ముసాయిదాపై సొసైటీ ఫర్ ఛేంజ్ ఇన్ ఎడ్యుకేషన్(ఎస్‌సీఐఈ) ఆధ్వర్యంలో కేయూ ఎస్‌డీఎల్‌సీఈ న్యూసెమినార్ హాల్‌లో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. చైర్‌పర్సన్ వి.గంగాధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్తలు, విషయ నిపుణులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏపీడీటీఎఫ్ పూర్వ అధ్యక్షుడు నర్సింహరెడ్డి ముసాయిదా అనుకూల, ప్రతికూల ప్రభావాలు, దీర్ఘకాలిక, అంతర్లీనంగా ఉన్న అంశాలు చర్చించారు. అధ్యక్షుడు ఎడమ శ్రీనివాస్‌రెడ్డి, సభ్యులు మురళి. సత్యనారాయణ, శంకరయ్య, వెంకట్రాంరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సూరయ్య, మధుసూదన్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...