బాధిత కుటుంబాలకు పొదుపు సాయం అందజేత


Mon,August 12, 2019 03:28 AM

నర్సంపేట,నమస్తేతెలంగాణ : నర్సంపేటలోని బీవో రోడ్డు పురుషుల పొదుపు పరస్పర సహాయక సంఘంలో సభ్యుడిగా ఉన్న నాగెల్లి రఘు(45) అనారోగ్యంతో మృతి చెందగా ఆ కుటుంబానికి పొదుపు సమితి అధ్యక్షుడు మేడిద రవి, సంఘం చైర్మన్ కక్కెర్ల రమేశ్ ఆదివారం ఆర్థికసాయం అందజేశారు. సభ్యుడి లావాదేవిలు సరిచేసి రూ.45 వేలు నామినీ అయిన భార్య సంధ్యారాణికి అందించారు. ఈ కార్యక్రమంలో మహాదేవుని జగదీశ్, ఎదురబోయిన రామస్వామి, కల్వచర్ల వాసుదేవాచారి, బోడ గోల్య, బోయిని రమేశ్, పస్తం కృష్ణ, ఎదురబోయిన భిక్షపతి, గొరంటల రమేశ్ పాల్గొన్నారు.

దుగ్గొండి : సమాజంలో ప్రతి ఒక్కరూ పొదుపును అలవర్చుకోవాలని పొదుపుతోనే కుటుంబంలో వెలుగు నిండుతుందని పొదుపు సంఘాల సమితి అధ్యక్షుడు రవీందర్ అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన బాలాజీ పురుషుల పొదుపు సంఘం సభ్యుడు పొగాకు రవి అనార్యోగంతో మృతి చెందారు. దీంతో నామిని ఆయనభార్య సూరమ్మకు సమితి అద్యక్షుడు రవీందర్ స్థానిక సభ్యులతో కలిసి ఆదివారం ప్రమాద బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన పురుషుల పొదుపు సంఘం సభ్యులలో ఎవరైనా అకస్మాత్తుగా మృతిచెందితే సంఘం నుంచి రూ. 35000 వేల చెక్కును అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు రమేశ్, సభ్యులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...