పిల్లలకు సంస్కారాన్ని నేర్పించాలి


Mon,August 12, 2019 03:27 AM

త్రిదండి దేవనాద రామానుజ జీయర్‌స్వామి
ఆత్మకూరు : గ్రామంలో ప్రతి ఒక్కరు త్రిదండి చినజీయర్‌స్వామి ఆజ్ఞను పాటించాలని త్రిదండి దేవనాద రామానుజ జీయర్‌స్వామి సూచించారు. ఆ దివారం మండలంలోని గూడెప్పాడ్ గ్రామంలో శ్రీభక్తాంజనేయ స్వామి దేవాలయానికి విచ్చేశారు. ఈసందర్భంగా గ్రామస్తులు, దేవాలయ కమిటీ సభ్యులు జీయర్‌స్వామికి స్వాగతం పలికారు. గత సంవత్సరం గ్రామంలో వికాస తరంగణి శాఖను ప్రారంభించి, స్వయంగా సభ్యత్వ నమోదును చేయించారు. ఈ సందర్భంగా దేవనాద రామానుజ జీయర్ స్వామి మాట్లాడుతూ గ్రామంలోని పిల్లలకు తల్లిదండ్రులు సంస్కారం నేర్పాలన్నారు. వికాస తరంగణి సంస్థ నుంచి మహిళలకు ప్రత్యేకంగా వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు ఆరుట్ల కేశవమూర్తి, మాధవమూర్తి, వెంకటరమణాచార్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...