కోపాకుల చెరువు నీటి విడుదల


Mon,August 12, 2019 03:27 AM

చెన్నారావుపేట,ఆగస్టు11: రైతులు సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు, వైస్ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి, చెన్నారావుపేట సర్పంచ్ కుండె మల్లయ్య సూచించారు. ఆదివారం మండల కేంద్రంలోని కోపాకుల చెరువు సాగునీటిని వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువులో ఆరు అడుగుల వరకు నీరు అందుబాటులో ఉందన్నారు. ఈ నీటిని ఆయకట్టు రైతులు పొదుపుగా వాడుకోవాలని సూచించారు. రెండు రోజుల్లో ఎత్తిపోతల పథకం ప్రారంభించి, దాని కింద ఉన్న ఆయకట్టు రైతులకు నీరు అందించనున్నట్లు తెలిపారు. మిట్టకాలువ, వంపు కాలువల మరమ్మతు పనులను కూడా ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ జున్నుతుల రాంరెడ్డి, ఉపసర్పంచ్ కంకల మాధవి, వీఆర్వో ఐలయ్య, కుండె సదాశివుడు, జోరు వీరయ్య, బొంత రాజు, చిట్టె లింగయ్య, హంస వీరస్వామి పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...