మృతుడి కుటుంబానికి అరూరి పరామర్శ


Mon,August 12, 2019 03:27 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు కొమురయ్య తండ్రి ఇటీవల అకాల మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించడానికి ఇప్పటికే జీవిత బీమా సంస్థకు పాలసీలకు సంబంధించిన మొత్తాన్ని చెల్లించారన్నారు. పార్టీ క్రియాశీల, సాధారణ సభ్యత్వాలు పొందిన ప్రతీ కార్యకర్తకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడినా ఆర్థికసాయం అందేలా ఏర్పాట్లు చేశారన్నారు. అలాగే పార్టీ నాయకుడు కొమురయ్యతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ రైతు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మార్నేని రవీందర్‌రావు, జెడ్పీటీసీ మార్గం భిక్షపతి, అర్బన్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ గజ్జెలి శ్రీరాములు, సర్పంచ్ అర్జుల మంగ, వైస్ ఎంపీపీ చొప్పరి సోమలక్ష్మి, పార్టీ నాయకులు భిక్షపతి, చొప్పరి సోమయ్య, తిరుపతిరెడ్డి, సుదర్శన్, రవీందర్, కుమారస్వామి, రాజశేఖర్, కస్తూరి అరున్, సోమేశ్వర్, రాజు ఉన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...