మత్తడికి చేరువలో మాదన్నపేట పెద్ద చెరువు


Mon,August 12, 2019 03:27 AM

14.6 అడుగులకు చేరిన నీటిమట్టం
నర్సంపేట రూరల్, ఆగస్టు11: ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు జిల్లాలోనే రెండో అతిపెద్దదైన మాదన్నపేట పెద్ద చెరువు మత్తడికి చేరువైంది. ప్రస్తుతం 14.6 ఫీట్ల నీరు చేరి చెరువు కళకళలాడుతోంది. గత ఏడాది ఆగస్టు నెల మొదటి వారంలోనే మాదన్నపేట చెరువు అలుగుపోసింది. చెరువులోకి 17 ఫీట్లు నీరు చేరితే అలుగు పోస్తుంది. గత సంవత్సరం రెండు సార్లు ఈ చెరువు మత్తడి పోసింది. ఈ దఫా వర్షాలు ఆలస్యంగా కురిశాయి. ప్రస్తుతం ఉన్న నీటికి తోడు మరో రెండున్నర ఫీట్ల నీరు వచ్చి చేరితే మత్తడి పడుతుందని, రెండో పంటకు ఢోకా ఉండదని ఆయకట్టు రైతులు చెబుతున్నారు. ఈ చెరువు కింద ఆయకట్టు రైతులు వరినాట్ల కార్యక్రమాన్ని జోరుగా చేపట్టారు. చెరువు పరిధిలోని దుబ్బకాల్వ, మిట్టకాల్వ, పెద్ద కాల్వల నుంచి ఆయకట్టు రైతుల పంట పొలాలకు సాగు నీటిని ఐబీ అధికారులు, నీటి సంఘం బాధ్యులు అందిస్తున్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...