చల్లా మల్లారెడ్డికి ఘన నివాళి


Mon,August 12, 2019 03:26 AM

శాయంపేట, ఆగస్టు 11 : పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తండ్రి చల్లా మల్లారెడ్డికి ఆదివారం పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆదివారం ప్రగతిసింగారంలోని ఎమ్మెల్యే ధర్మారెడ్డి నివాసానికి చేరుకుని ఆయనను పరామర్శించారు. మల్లారెడ్డి చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు. అలాగే వరంగల్ లోక్‌సభ సభ్యుడు పసునూరి దయాకర్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ సీతారాంనాయక్, రాష్ట్ర రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్‌రావు, వికలాంగుల సంస్థ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు మార్నేని రవీందర్‌రావు, భీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి తదితరులు ఎమ్మెల్యేను పరామర్శించారు. అంతేకాకుండా రూరల్ జిల్లా కలెక్టర్ ముండ్రాతి హరిత కూడా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని పరామర్శించి ఆయన తండ్రి మల్లారెడ్డికి నివాళులర్పించారు.

ఆర్డీవో మహేందర్‌జీ, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, కరీంనగర్ జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయగణపతి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర చైర్మన్ కన్నెబోయిన రాజయ్యయాదవ్, పెద్దపెల్లి గ్రంథాలయ చైర్మన్ తదితరులు కూడా ఎమ్మెల్యే ధర్మారెడ్డిని పరామర్శించి మల్లారెడ్డికి నివాళులర్పించారు. డాక్టర్ పోతాని రాజేశ్వర్‌రావు, భూపాలపల్లి డిప్యూటీ డీఎంహెచ్‌వో లలితదేవి, ఈఈ వెంకటరమణ, డీఈ దేవేందర్‌రెడ్డి, బీజేపీ నాయకుడు వెన్నంపెల్లి పాపయ్య, నడికూడ మండల వైస్ ఎంపీపీ చాంద కుమారస్వామి, ఆర్‌ఎంపీ డాక్టర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దావు రాజిరెడ్డి, జిల్లా కార్యదర్శి ఓరుగంటి రమేశ్, పరకాల అధ్యక్షుడు పొదిల రాజు, శంకర్‌లింగం, రజనీకాంత్, పద్మశాలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండు ప్రభాకర్, జిల్లా బీసీ కార్పొరేషన్ అధికారి నర్సింహస్వామి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి సురేశ్, కార్పొరేటర్ బయ్య స్వామి, ముదిరాజ్ సంఘం నాయకులు అశోక్, టీఆర్‌ఎస్ నాయకుడు పులి సారంగపాణి, రాష్ట్ర టీఎన్‌జీవోస్ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాల టీఎన్‌జీవోస్ కోఆర్డీనేటర్లు కోల రాజేష్‌కుమార్‌గౌడ్, జగన్మోహన్‌రావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాంకిషన్, షఫీమహ్మద్, ట్రెసా అధ్యక్షుడు రాజ్‌కుమార్, అర్బన్ జిల్లా కార్యదర్శి రామునాయక్, కిషన్‌రావు, మురళీధర్‌రెడ్డి, సదానందం, భవన్‌రెడ్డి తదితరులు ఎమ్మెల్యే చల్లాను పరామర్శించారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...