ఎమ్మెల్యే చల్లాకు మాజీ ఎంపీ పరామర్శ


Sun,August 11, 2019 03:49 AM

శాయంపేట, ఆగస్టు 10 : పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపెల్లి వినోద్‌కుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు శనివారం పరామర్శించారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి తండ్రి చల్లా మల్లారెడ్డి అనారోగ్యంతో ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు మండలంలోని ప్రగతిసింగారం గ్రామంలో మల్లారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డిని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే, పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, టీఆర్‌ఎస్ నాయకులు గుడిమల్ల రవికుమార్, జన్ను జకార్య, మేడిపల్లి శోభన్‌బాబు, ఇండ్ల నాగేశ్వర్‌రావు, పులి సారంగపాణి, మాజీ కార్పొరేటర్ పోలా నగరాజ్, డాక్టర్ భాస్కర్, వరంగల్ అర్బన్ జిల్లా సీఈవో ప్రసూనారాణి, ఆత్మకూరు ఎంపీడీవో నర్మద, ఎక్సైజ్ సీఐ జనార్దన్ తదితరులు కూడా ఎమ్మెల్యే చల్లాను పరామర్శించారు. అలాగే పలు విద్యార్థిసంఘాల నాయకులు, జర్నలిస్టులు కూడా పరామర్శించారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...