వృద్ధురాలిని చేరదీసిన పరకాల సీఐ మధు


Sun,August 11, 2019 03:49 AM

పరకాల, నమస్తే తెలంగాణ : పరకాల పట్టణంలోని వెలమవాడకు చెం దిన వృద్ధురాలిని పరకాల సీఐ గొర్రె మధు చేరదీసి అనాథ ఆశ్రమానికి తరలించారు. వెలమవాడకు చెందిన మేర సత్తెమ్మ (80) శిథిలావస్థలో ఉన్న ఇంట్లో నివాసం ఉంటోంది. ఆమెకు పెంచుకున్న కుమారుడు ఉన్నప్పటికీ ఆస్తిని పంచుకున్న అతడు ఆమె బాగోగులు చూడడం లేదు. విషయం తెలుసుకున్న పరకాల సీఐ మధు, ఎస్సైలు శ్రీకాంత్‌రెడ్డి, రవికిరణ్ అక్కడికి చేరుకుని సత్తెమ్మ నివాసం ఉన్న ఇంటిని పరిశీలించారు. పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో హన్మకొండలోని సహృదయ వృద్ధాశ్రమం వారితో మాట్లాడి సత్తెమ్మను ప్రత్యేక వాహనంలో అక్కడికి తరలించారు. మానవతా దృక్ఫథాన్ని చాటుకున్న పరకాల పోలీసులను స్థానికులు అభినందించారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...