ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో..


Sun,August 11, 2019 03:48 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : మండలంలోని ల్యాబర్తి గ్రామంలో ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక ఎక్సైజ్ సీఐ కరుణశ్రీ, సర్పంచ్ పస్తం రాజు, ఎంపీటీసీ అన్నమనేని ఉమాదేవి పాల్గొని గౌడ సంఘం ప్రతినిధులు, ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి చెరువు కట్టపై మొ క్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలను సొసైటీ సభ్యు లు విధిగా సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సైలు వెంకటేశ్వర్‌రావు, రాజసమ్మయ్య పాల్గొన్నారు.

మొక్కలను విరివిగా పెంచాలి
శాయంపేట : ప్రతి ఒక్కరూ మొక్కలను విరివిగా పెంచి, ప్రకృతిని సంరక్షించేందుకు కృషి చేయాలని శాయంపేట సీఐ వెంకటేశ్వర్‌రావు కోరారు. మండలం లోని తహార్‌పూర్ గ్రామంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్‌రావు, ఎస్సై జక్కుల రాజబాబు, సర్పంచ్ తాటికొండ మౌనిక మొక్కలను నాటారు. అనంతరం సీఐ మాట్లాడుతూ ప్రకృతిని రక్షించుకోవాలంటే మొక్కలను పెంచాలని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరక్టర్ నిమ్మల మహేందర్, ఎం పీటీసీ సభ్యురాలు గొట్టిముక్కల స్వాతి, ఉప సర్పంచ్ కుక్కల బిక్షపతి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు తాటికొండ రవికిరణ్, వార్డు సభ్యులు కొమ్ముల సంతోష్, గొట్టిముక్కుల విష్ణువర్ధన్‌రెడ్డి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...