స్వచ్ఛమైన వాతావరణం అందించాలి


Sun,August 11, 2019 03:47 AM

నర్సంపేట రూరల్, ఆగస్టు10: భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతీ ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని నర్సంపేట ఏసీపీ సునీతామోహన్ సూచించారు. మండలంలోని లక్నెపల్లి శివారు బిట్స్ ఆవరణలో హరితహారంలో భాగంగా డీఎఫ్‌వో పురుషోత్తంతో కలిసి ఆమె మొక్క లు నాటి నీళ్లు పోశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ, డీఎఫ్‌వో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటడం వల్ల భవిష్యత్ తరాలకు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వొచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమంతో అడవుల శాతాన్ని పెం చేందుకు లక్ష్యాన్ని నిర్ధేశించిందన్నారు. నాటడం సామాజిక బాధ్యతగా పరిగణించాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ కళాశాలల విద్యార్థులు 300 మొక్కలు నాటారు. కార్యక్రమంలో బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ అండృ రాజేంద్రప్రసాద్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ వీఎస్ హరిహరన్, రాధాకృష్ణ, ఫణీంద్ర, నారాయణ, ఏవో సలేంద్ర సురేశ్, మేనేజర్ పెండ్యాల యాదగిరి పాల్గొన్నారు.

మొక్కలను సంరక్షించాలి
పరకాల, నమస్తే తెలంగాణ : హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించాలని పరకాల ఎక్సైజ్ సీఐ జగన్నాథం కోరారు. నడికూడ మండలంలోని నడికూడ, పులిగిల్ల గ్రామాల్లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రభుత్వం గీతకార్మికుల సంక్షే మం కోసం ఉచితంగా ఈత మొక్కలను అందిస్తోందన్నారు. ఈ మొక్కలు పెంచి పెద్దచేస్తే గీత కార్మికులకు ఉపాధి ఉం టుందని చెప్పారు. పులిగిల్ల గ్రామంలోని నల్లచెరువు కట్ట, నడికూడ గౌడ సొసైటీ భూమిలో విరివిగా మొక్కలను నాటినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు ఊర రవీందర్‌రావు, సదానందం, ఎక్సైజ్ ఎస్సై పద్మ, హెడ్‌కానిస్టేబుల్ లక్ష్మణాచారి, ఎండీ రసూల్, భా స్కర్, విష్ణువర్ధన్, నారగోని రమేశ్, రాములు తదితరులు పాల్గొన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...