పేదలకు అండగా తెలంగాణ సర్కారు


Sun,August 11, 2019 03:47 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : ఆరోగ్యశ్రీ వర్తించిన పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని చెన్నారం గ్రామానికి చెందిన కట్ట అనీత ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంది. ఆమెకు ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో సీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ.54వేలను ఎమ్మెల్యే అరూరి రమేశ్ మంజూరు చేయించారు. ఈ మేరకు చెక్కును ఎమ్మెల్యే శనివారం కట్ట అనీత కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి మంజూరు కానన్ని సీఎంఆర్ నిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో పేదలకు మంజూరు చేయించినట్లు చెప్పారు. అంతేకాక నియోజకవర్గంలోని పీహెచ్‌సీలతో పాటు వర్ధన్నపేట సీహెచ్‌సీని కూడా ఆధునీకరించి పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రజలు, వైద్యులు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో చెన్నారం సర్పంచ్ పునుగోటి భాస్కర్‌రావు, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

హసన్‌పర్తి : సీఎం కేసీఆర్ పాలనలోనే నిరుపేదల సంక్షేమంగా ఉంటారని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. వివిధ కారణాలతో అనారోగ్యానికి గురైన 56వ డివిజన్ కేంద్రం హసన్‌పర్తికి చెందిన బాధితులు వీసం సమ్మిరెడ్డి, ముత్యాల రాజేందర్‌కు ఎమ్మెల్యే సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ డివిజన్ నాయకుడు కందుకూరి చంద్రమోహన్ పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...