స్వాతంత్య్ర వేడుకలకు పల్లా


Sun,August 11, 2019 03:46 AM

వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ : జిల్లాలో ఆగస్టు 15న జరుగనున్న స్వాతంత్య్ర వేడుకలకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా అర్బన్ జిల్లాలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరై జెండాను ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. ములుగులో ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు జాతీయ పతకాన్ని ఆవిష్కరించనున్నారు. ఇక జయశంకర్, మహబూబాబాద్, జనగామ జిల్లాలో ఆయా జెడ్పీ చైర్మన్లు మువ్వన్నెల జెండాలను ఎగురవేయనున్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...