మొక్కమొక్కకు లేక్క


Sat,August 10, 2019 03:30 AM

-ఐదో విడత హరితహారంలో నాటనున్న మొక్కలు 2.13 కోట్లు
-85 శాతం మొక్కలు బతకకపోతే సంబంధిత అధికారులు,పాలకవర్గాలపై చర్యలు
-స్పష్టం చేస్తున్న కొత్త పంచాయతీరాజ్ చట్టం
-జిల్లాలో అడవుల విస్తీర్ణం పెంచేందుకు అధికారుల కృషి

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వానలు కురవాలి.. కోతులు వాపస్ పోవాలి.. ఇందుకోసం నాటిన ప్రతీ మొక్కకు లెక్క ఉండాల్సిందే.. ఆ మొక్కలను పెంచి పెద్దచేయాల్సిన బాధ్యత గ్రామపంచాయతీ, మున్సిపల్ పాలకవర్గాలతోపాటు పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ అధికారులు, సిబ్బందిదే అనే విషయాన్ని నూతన పంచాయతీరాజ్ చట్టం స్పష్టం చేస్తున్నది. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేసేందుకు వరంగల్ రూరల్ జిల్లాలో అధికారయంత్రాంగం చర్యలు చేపట్టింది. జిలా ్లవ్యాప్తంగా ఐదో విడత హరితహారంలో 2.13 కోట్ల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేసి ఊరూరా నర్సరీలను నెలకొల్పారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ), అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ మొక్కలను పెంచుతున్నారు. నర్సరీల్లో పెంచుతున్న పండ్లు, పూలు, నీడ, కలపనిచ్చే మొక్కలను అడిగినవారికి ఉచితంగా అందించనున్నారు. జిల్లాలోని 16 రెవెన్యూ మండలాల్లో 401 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో ఈ రెండు శాఖల ద్వారా అంచనాలకు పది శాతం ఎక్కువగా మొక్కలను పెంచారు.

ఈ మొక్కలను నాటే కార్యక్రమంలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఊరూరా నర్సరీలను ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగం పర్వతగిరి, ఆత్మకూరు మండలాల్లోని రెండు గ్రామపంచాయతీలు మినహా మిగతా అన్నిచోట్ల నర్సరీలను నెలకొల్పినట్లు ప్రకటించింది. పెంచుతున్న ఈ మొక్కలను పంపిణీకి సిద్ధం చేసింది.
కొత్త పంచాయతీరాజ్ చట్ట ప్రకారం ఈ మొక్కలను నాటడమేకాదు పెంచే బాధ్యత కూడా గ్రామపంచాయతీ, మున్సిపల్ అధికారులు, పాలకవర్గ సభ్యులు, బాధ్యులకు కొత్త పంచాయతీరాజ్ చట్టం ద్వారా అప్పగించింది. నాటిన మొక్కలకు లెక్క ఉండడంతోపాటు బతికించిన ప్రతీ మొ క్కను కూడా లెక్కకట్టనున్నారు. ఏ గ్రామం, ఏ పట్టణంలోనైతే 85 శాతం మొక్కలు దక్కకపోతే ఆ గ్రామ పంచాయతీ, మున్సిపల్ పాలకవర్గం, కార్యదర్శులు, అధికారులపై చర్యలు తీసుకోనున్నా రు. దీంతో వా ర్డు సభ్యుల నుంచి మొదలు కౌన్సిలర్లు, స ర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్లు, కోఆప్షన్ సభ్యులు, ఉప సర్పంచ్‌లు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ ఏరియా అధికారులు ఎంతో శ్రద్ధతో మొక్కలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఐదో విడత హరితహారానికి అధికారులు, ప్రజాప్రతినిధులను బాధ్యులను చేస్తూ నిర్వహిస్తుండడంతో సత్ఫలితాలు ఉండనున్నాయి. కొత్త చట్టం ప్రకారం ప్రతీ మొక్కకు నీటినిపోసి బతికించే బాధ్యత ప్రభుత్వ అధికారులదే. కాగా, మొదట బాధ్యత పంచాయతీ కార్యదర్శి, రెండో బాధ్యత సర్పంచ్‌లది. మూడేళ్ల పదవీ కాలంలో నాటిన మొక్కల్లో 85 శాతం దక్కితేనే సర్పంచ్‌ల పదవులు, కార్యదర్శుల కొలువు ఉంటుంది. లేకుంటే కార్యదర్శులు కొలువులు, సర్పంచ్‌ల పదవులు ఊడిపోనున్నాయి.

జిల్లాలో 6.99 శాతం మాత్రమే అటవీ విస్తీర్ణం
జిల్లాలో పంచాయతీలు, మున్సిపాలిటీలకు మొక్కల సంరక్షణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. అన్ని ప్రభుత్వ శా ఖలు మొక్కలు నాటేలా ఇప్పటికే కేటాయింపులను పూర్తిచేశా రు. జిల్లా విస్తీర్ణం 2175.480 స్కేర్ కిలోమీటర్లు కాగా.. 152.167 స్కేర్ కిలోమీటర్లలో మాత్రమే అడవులు ఉన్నా యి. 7,16,457 జనాభాకు 6.99 శాతం అడవులు మాత్రమే ఉన్నాయి. జనాభా నిష్పత్తితో చూస్తే అడవుల విస్తీర్ణం చాలా తక్కువగా ఉంది. దీంతో జిల్లాలో హరితహారాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారయంత్రాంగం చర్యలు చేపట్టింది.

జిల్లాలో నాటిన మొక్కలను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది. వ్యక్తిగతంగా ప్రతీ ఇంటికి ఆరు నుంచి పది మొక్కలను ఇ వ్వనున్నాం. వాటిని కాపాడాల్సిన బాధ్యత ఇళ్ల యజమానులదే. సా మూహిక ప్రాంతాలు, ప్రభుత్వ స్థలాలు, శ్మశాన వాటికల్లో రోడ్లకు ఇ రువైపులా మొక్కలను నాటి కాపాడాల్సిన బాధ్యత కార్యదర్శులు, సర్పంచ్‌లదే. కొత్త పంచాయతీరాజ్ చట్ట ప్రకారం మొదట బాధ్యత వహించాల్సింది కార్యదర్శి.. రెండోసారి బాధ్యత వహించాల్సి వచ్చేది సర్పంచే. చట్టంలో పొందుపర్చినట్లుగా నాటిన మొత్తం మొక్క ల్లో 85 శాతం కాపాడాల్సిందే. లేకుంటే చర్యలుంటాయి. కొన్ని సందర్భాల్లో కార్యదర్శులు కొలువులను, సర్పంచ్‌లు పదవులను కోల్పోయేలా చట్టంలో రూపొందించారు. ప్రజాప్రతినిధులు, అధికారు లు, యువకులు, మహిళా సంఘాలు ఐదో విడత హరితహారాన్ని విజయవంతం చేయడంతోపాటుగా నాటిన ప్రతీ మొక్కను కాపాడాలి.
- రాచర్ల పరమేశ్వర్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఏపీడీ

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...