రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు


Sat,August 10, 2019 03:26 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, ఆగస్టు09: వరంగల్ అర్బన్ జిల్లా పంథిని వద్ద జరిగిన ఆటో ప్రమాదంలో మండలంలోని ఇల్లంద గ్రామానికి చెందిన మహిళలకు గాయాలైన ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. మండలంలోని ఇల్లంద గ్రామానికి చెందిన శ్రీరామోజు రజని, కుంబం కల్యాణి, బేతి మాధవి, ఇట్టబోయిన విమల, శంకపెల్లి రజితతో పాటుగా ఆటో డ్రైవర్ మునుకుంట్ల సంపత్‌కు చెందిన ఆటోలో ఇల్లంద నుంచి ఉదయం వరంగల్‌కు వెళుతున్నారు.

ఈ క్రమంలోనే పంథిని వద్దకు వెళ్లగానే ఆటో అదుపుతప్పి రహదారికి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ఆటోలో వెళ్తున్న మహిళలతో పాటు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు, ఐనవోలు పోలీసులు వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. వీరిలో శంకపెల్లి రజని తలకు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ నిమ్స్‌కు ఎమ్మెల్యే అరూరి రమేశ్ సహకారంతో తరలించారు. మిగిలిన క్షతగాత్రులు ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందుతున్నట్లు ఇల్లంద గ్రామస్తులు తెలిపారు. కాగా, క్షతగాత్రులను ఇల్లంద సర్పంచ్ సుంకరి సాంబయ్య, ఎంపీటీసీలు శ్రీనివాస్, పిట్టల జ్యోతి పరామర్శించారు. కాగా ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...