ఉన్నత విద్యతోనే సమాజంలో గుర్తింపు: దేవేందర్


Sat,August 10, 2019 03:26 AM

దుగ్గొండి, ఆగస్టు09: విద్యార్థులు లక్ష్యంతో విద్యనభ్యసిస్తేనే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని మండలంలోని గిర్నిబావిలోగల మహత్మాజ్యోతిబాపూలే బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, ప్రత్యేకాధికారి కూరోజు దేవేందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని గిర్నిబావిలో మహత్మాజ్యోతిబాపూలే బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు నూతనంగా ఏర్పాటు చేసిన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌ను ప్రత్యేకాధికారి కూరోజు దేవేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో, ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని గురుకుల విద్యార్థులు సద్వినియోగం చేసుకోని ప్రయోజకులుగా ఎదగాలన్నారు.

రూ.40వేల విలువ చేసే అహుజా బ్రాండ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌ను ఎంజేపీటీబీసీ డబ్ల్యూఆర్‌ఈఐఎస్ సొసైటీ హైదరాబాద్ కార్యదర్శి మల్లయ్యబట్టుకు, ఆర్‌సీవో లక్ష్మీనారాయణ, జిల్లా కన్వీనర్ మనోహర్‌రెడ్డికి ప్రత్యేకాధికారి దేవేందర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మానస, శ్రీదేవి, కోటి, శ్రీనివాస్, పీఈటీ బాబు, రమేశ్, ప్రేమలతా, రోజా, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, గురుకుల బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...