చనిపోయిన నెమలి అటవీ శాఖకు అప్పగింత


Sat,August 10, 2019 03:26 AM

రాయపర్తి, ఆగస్టు09: చికిత్స పొందుతూ మృతి చెందిన జాతీయ పక్ష్మి నెమలి కళేబరాన్ని వర్ధన్నపేట వన సేవకుడు వెంకటయ్యకు శుక్రవారం ఎస్సై జలగం లక్ష్మణ్‌రావు నేతృత్వంలో గ్రామానికి చెందిన యువత, సిబ్బంది అందజేశారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని మాల వాడ సమీపంలో కోతుల దాడిలో తీవ్ర గాయాలతో నెమలి సంచరిస్తున్నట్లు గుర్తించిన సర్పంచ్ గారె నర్సయ్యకు తమకు సమాచారం అందించినట్లు చెప్పారు. వెంటనే తాము ఘటనా స్థలికి చేరుకుని గాయపడిన నెమలిని పశు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తుండగా నెమలి మృత్యువాత పడినట్లు ఆయన వివరించారు. సదరు విషయాన్ని అటవీ శాఖ కార్యాలయాలనికి సమాచారం అందించగా వన సేవకుడు వెంకటయ్యకు అప్పగించాలని సూచించడంతో వెంకటయ్యకు నెమలి ఖననం బాధ్యతలను అప్పగించినట్లు ఆయన వివరించారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...