ప్రభుత్వ సంక్షేమ పథకాలు భేష్


Mon,July 22, 2019 01:32 AM

గీసుగొండ, జూలై 21 : పేదలు ఆత్మగౌరవంతో బతకాలని రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు భేష్ అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోని లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రశేశ పెట్టారన్నారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో పెంచిన పింఛన్ ప్రోసిడింగ్స్ ఉత్తర్వులను ఎంపీపీ బీమగాని సౌజన్య అధ్యక్షతన పంపిణీ చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధ్దిదారులకు ప్రోసిడింగ్స్ అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వృద్ధులు, వికలాంగులు, వింతువులు, ఒంటరి మహిళలు, బీడి కార్మికులు, గీత, నేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం జూన్ మాసం నుంచి పింఛన్‌ను రెట్టింపు చేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ పేదింటి పెద్దకొడుకు లాంటి వారని తెలిపారు. రైతులు సుఖంగా ఉంటే దేశం పచ్చగా ఉంటుందని సీఎం కేసీఆర్ రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా పథకాన్ని పెట్టారన్నారు. సరైన సమయంలోఎరువులు, విత్తనాలను అందిస్తూ వ్యవసాయ రంగాన్ని సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని అన్నారు. గత పాలకులు రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని అయన మండిపడ్డారు. 24 గంటల కరెంటును రైతులకు ఉచితంగా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. గత పాలకులు రెండు వందల పింఛన్ ఇస్తే సీఎం కేసీఆర్ రూ. 2016 పింఛన్ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

మండలంలో 4562 మంది నెలనెల పింఛన్ తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలోనే 57 ఏళ్లు నిండిన వారికి కూడా ప్రభుత్వం పింఛన్‌ను అందిస్తుందన్నారు. వ్యవసాయానికి ఈజీఎస్ పనులను అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినట్లు అయన తెలిపారు ఈకార్యక్రమంలో జెడ్పీటీసీ పోలీసు ధర్మారావు, సర్పంచ్ దౌడుబాబు, ఎంపీటీసీ కోమాల, ఎంపీడీవో గడ్డం రమేశ్, ఈవోపీఆర్డీ శే షాంజన్‌స్వామి, వివిధ గ్రామాల సర్పంచులు అంకతి నాగేశ్వర్‌రావు, పూండ్రు జైపాల్‌రెడ్డి, గోనె మల్లారెడ్డి, బోడకుంట్ల ప్రకాశ్, వీరాటి కవిత, సరోజన, డోలి రాధాబాయి, గోపి, మొగసాని నాగదేవత సంపత్, ఎంపీటీసీలు బేతినేని వీరరావు, హనుమ, రజిత, మండల నాయకులు వీరాగోని రాజుకుమార్, గోపాల నవీన్‌రాజు, ముంత రాజయ్య, కోలా కుమారస్వామి, జక్కు మురళీ, గోలిరాజయ్య, డుక్రె రమేశ్, డోలి రమేశ్ , ధనుంజయ్, ముగాల రవీందర్, రాజు, చంద్రారెడ్డి వీరాటి రవీందర్‌రెడ్డి, లింగారెడ్డి, కోటి, సాంబామూర్తి కట్టస్వామి,భిక్షపతి త పాల్గొన్నారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...