మహంకాళి దయతో జీవించాలి


Mon,July 22, 2019 01:30 AM

శాయంపేట, జూలై 21 : మండలంలోని గట్లకానిపర్తి గ్రామం ఆదివారం బోనమెత్తింది. డప్పుచప్పుళ్లతో ఇంటిం టా బోనాలతో సందడి నెలకొంది. గ్రా మంలో మహంకాళీ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా జరిగింది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి జాతరలో పాల్గొని బోనమెత్తారు. అమ్మవారికి పూజలు చేశారు. గట్లకానిపర్తిలోని మహంకాళీ అమ్మవారి జాతర రాష్ట్రంలోనే రెండో పెద్ద జాతరగా గుర్తింపు పొందింది. ఐదేళ్లుగా ఇక్కడ మహంకాళీ అమ్మవారి బోనాల జాతర జరుగుతోంది. ఆషాఢమాసంలో జరిగే ఈ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా జారతలో పాల్గొన్న జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ గట్లకానిపర్తిలో మహంకాళీ అమ్మవారికి బోనాల పండుగ చేసుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశానని, అమ్మ దయతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ బొమ్మకంటి సాంబయ్య, ఎంపీటీసీ రజిని, గుర్రం అశోక్, దేవాలయ కమిటీ చైర్మన్ బొమ్మకంటి పోశాలు, వైస్ చైర్మన్ బొమ్మకంటి శ్రీకాంత్, బొమ్మకంటి రాజేందర్, నరేశ్, కుమారస్వామి, రాజు, సంతోష్, బుస్స సంపత్, ఆనందం, గుర్రం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...