పింఛన్‌దారుల దేవుడు ముఖ్యమంత్రి


Sun,July 21, 2019 01:40 AM

నర్సంపేట, నమస్తే తెలంగాణ : పింఛన్‌దారుల దేవుడు సీఎం కేసీఆర్ అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చేతుల మీదుగా కేక్‌ను కట్ చేయించారు. దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్‌దారులు సంతోషంతో ఉన్నారని అన్నారు. నల్లా మనోహర్‌రెడ్డి, జున్నూతుల రాంరెడ్డి, కుం డె మల్లయ్య, జున్నుతుల మహేందర్‌రెడ్డి, పుప్పాల రజిత, ఎంపీఆర్‌డీ జిల్లా అధ్యక్షుడు అడ్డరాజు, ఆబోతు రాజు, ఊర్మిళ, రజిత, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

నర్సంపేట, నమస్తే తెలంగాణ : పింఛన్లను రెట్టింపు చేసిన మనసున్న మారాజు సీఎం కేసీఆర్ అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం నర్సంపేట మున్సిపల్ కార్యాలయం, వల్లభ్‌నగర్, హరిజన వాడ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమాల్లో పింఛన్‌దారులకు ప్రొసీడింగ్స్ అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ పింఛన్‌దారుల సమస్యలను ఎన్నికలకు ముందే సర్వే చేయించి తెలుసుకున్నారని అన్నారు. రూ.2016 వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీకార్మికులు, గీత, నేత కార్మికులకు, రూ.3016 దివ్యాంగులకు పెంచుతానని ఎన్నికలకు ముందే హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దీంతో పింఛన్ లబ్ధిదారులు రెండోమారు టీఆర్‌ఎస్ అధికారం వచ్చేలా చేశారని తెలిపారు. దేశంలోనే ఇంత పెద్ద సంఖ్యలో పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణేనని అన్నారు. పింఛన్ల పెంపుతో లబ్ధిదారులు ఆత్మగౌవంతో జీవిస్తున్నారని తెలిపారు. లబ్ధిదారుల దీవెనలతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు జీవించి ఈ పథకాలను అందించాలని ఆకాంక్షించారు. ఈ పథకంకూడా నూరేళ్లు వర్ధిల్లాలని ఆయన కోరారు. పింఛన్లు పెంచడం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి భారమైనప్పటికీ సీఎం పట్టుదలతో డబ్బులు ఖాతాల్లో వేస్తున్నారని అన్నారు. జూన్ మాసం పింఛన్ డబ్బులు ఆగస్టు 1వ తేదీన లబ్ధిదారుల అకౌంట్లలో పడతాయని ఆయన వివరించారు. నర్సంపేట పట్టణం పరిధిలో మొత్తం ఆసరా పింఛన్ల లబ్ధిదారులు 3,723 ఉన్నారని, వీరికి ప్రతీ నెల రూ.81 లక్షలు ఖర్చు అవుతున్నదని అన్నారు. కార్యక్రమాల్లో నర్సంపేట ఆర్డీవో ఎన్ రవి, కమిషనర్ వెంకటేశ్వర్‌రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణగౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, మునిగాల వెంకట్‌రెడ్డి, బండి రమేశ్, వాసం సాంబయ్య, పుట్టపాక కుమారస్వామి, గంప రాజేశ్వర్‌గౌడ్, మండల శ్రీనివాస్, మందు ల శ్రీనివాస్, శివరాత్రి స్వామి, నాయిని నర్సయ్య, పెండెం వెంకటేశ్వర్లు, దారంగుల నగేశ్, బాణాల రాంబాబు, దార్ల రమాదేవి, బండి ప్రవీణ్, కొంకీస జ్ఞాన్‌సాగర్‌గౌడ్ పాల్గొన్నారు.

పేదల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం
సీఎం కేసీఆర్ నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపారని, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం నర్సంపేట పట్టణంలోని సర్వాపురం పాత గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ద్వారకపేట, సర్వాపురం గ్రామాల లబ్ధిదారులకు పెరిగిన ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించి మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్ నాగెళ్లి వెంకటనారాయణగౌడ్, మాజీ వైస్ చైర్మన్ మునిగాల పద్మ, మాజీ ఎంపీపీ నల్లా మనోహర్‌రెడ్డి, నీటి సంఘం మాజీ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ పుట్టపాక కుమారస్వామి, మాజీ కౌన్సిలర్లు గుంటి కిషన్, నాయిని నర్సయ్య, రాయిడి రవీందర్‌రెడ్డి, ఎర్ర యాకూబ్‌రెడ్డి, పెండెం వెంకటేశ్వర్లు, మినుముల రాజు, దారంగుల రజిత, కొంకీస జ్ఞాన్‌సాగర్, నాయకులు శీలం రాంబాబు, శ్రీధర్‌రెడ్డి, గడ్డం శ్రీనివాస్, కొమ్మ వీరస్వామి, గండు యాదగిరి, వేమ కొమ్మాలు, లక్ష్మీనారాయణ, సట్ల అశోక్, దారంగుల నగేశ్ పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...