పకడ్బందీగా పురచట్టం


Sat,July 20, 2019 05:59 AM

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : అడుగడుగునా అవినీతి, అడ్డగోలు నిర్వహణ, నత్తకు నడకనేర్పే విధంగా పని విధానం, పైసలు లేనిదే ఫైలు కదలని తీరు పురపాలక సంఘాలు (మున్సిపాలిటీల్లో) కనిపిస్తున్నది. దీనిని రూపుమాపడంతోపాటు పారదర్శకంగా పురపాలక సంఘాలు పనిచేసేలా రాష్ట్ర ప్రభు త్వం 2019 మున్సిపల్ చట్టాన్ని తీసుకవచ్చింది. 1961నాటి పురపాలక చట్టంలో సమూల మా ర్పులు తెచ్చింది. నూతన పంచాnతీరాజ్ చట్టం 2018ని అమలులోకి తెచ్చి సత్ఫలితాలను సాధిస్తున్న క్రమంలో ప్రజలపాలిట గుదిబండగా మారిన పురపాలక చట్టంలో సమూల మార్పు లు తెచ్చిన ప్రభు త్వం ప్రజాప్రతినిధులను, అధికారులను బాధ్యులను చేస్తూనే ప్రజలకు పారదర్శకమైన సేవలను డిమ్డ్ విధానంలో అందించడం, ప్రజలు కూడా తమ బాధ్యతలను గుర్తెరిగేలా చట్టాన్ని రూపొందించి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురు వారం సభలో ప్రవేశపెట్టిన చట్టం శుక్రవారం నాడు పూర్తిస్థాయి ఆమోదాన్ని పొందింది. దీంతో పురపాలక సంఘాల పరంగా, వాటిల్లోని పాలకవర్గాల వల్ల ఎదురయ్యే సమస్యలు తొలగిపోగా అందరి భాగస్వామ్యంతో అభివృద్ధి సాధించడం, ప్రజల మౌలిక వసతుల కల్పనకు బాటలువేశారు. పురపాలికల్లో చోటుచేసుకున్న అవినీతికి అడ్డుకట్ట వేయడం, అక్రమ కట్టడాలను అదుపుచేయడం, తెలంగాణ మున్సిపల్ చట్టం ద్వారా పూర్తి పారదర్శకతను కల్పించడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ప్రజలే కేంద్ర బిందువుగా అధికారులు, ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం పెంచడంతోపాటు అవినీతిరహిత పాలన ప్రజలకు మేలు చేసే కొత్త చట్టం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేతులమీదుగా రూపొందించుకుంది. అంతేకాకుండా ప్రజలకు మేలు చేసేలా ఈ కొత్త చట్టాన్ని రూపకల్పన చేసి ఆమోదించిన ప్రభుత్వం పేదలకు మేళ్లను చేకూర్చింది. 75 గజాలలోపు ఇంటి నిర్మాణానికి రిజిస్ట్రేషన్ ఫీజును నిర్ణయించింది. ఒక్క రూపాయితోనే 75 గజాల ఇంటిస్థలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకునేలా ఈ చట్టంలో పొందుపర్చింది. అంతేకాకుండా 75 గజాలలోపు ఇల్లును జీ+1 వరకు నిర్మించుకున్న ఇంటికి రూ.100 మాత్రమే ఏటా ఇంటిపన్నును నిర్ధారించింది. దీంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలోని బడుగులకు విద్యుత్, నల్లా, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు లాంటి వాటితోపాటు మౌలిక వసతులు పొందేందుకు తమ భూమి తమ ఇల్లు పక్కాగా రికార్డుల్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. ఇక 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాలు చేసుకునేవారు అనుమతుల కోసం పురపాలక సంఘాలు, కార్యాలయాల చుట్టూ తిరగకుండా నిర్ణీత సమయంలో ఆన్‌లైన్‌లోనే అనుమతులు పొందే వెసలుబాటును కల్పించింది. గడువు ముగిసేవరకు కూడా ఇంటి అనుమతి ల భించకపోతే 16వ రోజు అనుమతి లభించినట్లుగానే యజమాని తన పనిని తాను చేసుకునే అవకాశాన్ని కూడా పొందుపర్చింది. ప్రతీ ఇంటి యజమాని ఇల్లు విస్తీర్ణాన్ని అసెస్‌మెంట్ చేసే సందర్భంలో ఆ సిబ్బం ది, అధికారుల నుంచి వేధింపులు లేకుండా ప న్ను తగ్గించుకునేందుకు తప్పుడు కొలతలు నమో దు చేయకుండా ఉండే లా ప్రతీ ఇంటి యజమాని తన ఇంటి విస్తీర్ణాన్ని పారదర్శకమైన కొలతలతో సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చేలా చట్టం లో నిబంధన పొందుపర్చింది. పన్ను తగ్గించుకునేందుకు ఇంటి కొలతల్లోగానీ, మరేదైనా తప్పుడు సమాచారాన్ని ఇంటి యజమాని అందిస్తే అధికారుల ఆకస్మిక తనిఖీల్లో బయటపడితే ఆ ఇంటి యజమానిపై భారీ జరిమానాలు విధించబడతాయి. తప్పు డు ధ్రువీకరణలను అందిస్తే ఆ యజమానికి 25 రెట్ల జరిమానా విధించేందుకు చట్టంలో నిబంధన పొందుపరిచారు. అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేసే అధికారాలను మున్సిపాలిటీలకు అప్పగించింది. మోడుబారిన పట్టణాలను పచ్చని చెట్ల తో కలకలలాడేలా తయారుచేయాలని, దీనికో సం పల్లెలు, పట్టణా ల్లో గ్రీన్‌కవర్ పాలసీని అమలుచేసే బాధ్యతను మున్సిపాలిటీలకు అప్పగిస్తూనే కలెక్టర్ల ఆధ్వర్యంలో గ్రీన్ కమిటీ ఏర్పాటు చేసేలా చట్టంలో నిబంధన పొందుపరిచారు.

హరితహారం లక్ష్యాలపై అధికారులు నిర్లక్ష్యం చేస్తే తొలగించేలా బాధ్యతలు విస్మరించిన కౌన్సిలర్లు, చైర్మన్లు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకునేలా ఈ చట్టాన్ని రూపొందించారు. హరిత లక్ష్యాలపై అశ్రద్ధ చేసే అధికారులను, ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించడంతోపాటు బాధ్యతలు విస్మరించే ప్రజాప్రతినిధులను కూడా పదవుల్లో నుంచి తొలగించేవిధంగా కొత్త చట్టం ఉండబోతున్నది. ఏళ్లతరబడిగా మున్సిపాలిటీల్లో తిష్టవేసి తమతమ పలుకుబడులతో బదిలీలకు దూరంగా ఉంటూ పనిచేస్తున్న సిబ్బందిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలీ చేసేలా ఈ చట్టం ఉంది. తెలంగాణ మున్సిపల్ చట్టం - 2019 ప్రకారం జిల్లా కలెక్టర్లకు కీలకమైన బాధ్యతలను అప్పగించారు. ఈ చట్టం అమలులోకి వస్తుండడంతో మున్సిపాలిటీల్లోని అవినీతి, అక్రమాలకు, అక్రమ నిర్మాణాలకు అధికారుల కనుసన్నల్లో జరిగే అక్రమ లేఔట్ల ఏర్పాటుకు తెరపడనున్నది. అవినీతి రహిత పాలనను అందించడంతోపాటు తెలంగాణ మున్సిపల్ చట్టం పూర్తిపారదర్శకంగా ప్రజలకు సేవలందించేలా రూపొందించి ఆమోదించడంపై జిల్లాలోని మూడు మున్సిపాలిటీల ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అవసరాలను గుర్తించి వారికి ఎలాంటి కష్టనష్టాలు లేకుండా వ్యయప్రయాసలకు గురికాకుండా ఉండేలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ద్వారా పౌరసేవలను పొందేలా ఈ చట్టాన్ని రూపొందించడంపై జిల్లాలోని పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలలోని ప్రజలు సర్వత్రా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...