రూ.15 కోట్లతో నర్సంపేట అభివృద్ధి


Sat,July 20, 2019 05:55 AM

నర్సంపేట, నమస్తే తెలంగాణ : నర్సంపేట అభివృద్ధికి రూ.15 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయడంతో టీఆర్‌ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ మేరకు శుక్రవారం టీఆర్‌ఎస్ నాయకులు నర్సంపేటలో పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ నాయకుడు మున్సిపల్ మాజీ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణగౌడ్, పట్టణ అధ్యక్షుడు నాయిని నర్సయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పట్టుదలతో నర్సంపేట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని పెట్టారని అన్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి నర్సంపేటను మోడల్ పట్టణంగా మార్చేందుకు నిధులు మంజూరు చేయించడంలో కృషి చేస్తున్నారని చెప్పారు. గత కొన్నేండ్లుగా వెనుకబడిన నర్సంపేటను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా ముందుకు వెళ్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నర్సంపేటను మోడల్ సిటీగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకుందని పేర్కొనారు. ఇందులో భాగంగానే కొన్ని నెలల కిందట రూ.35 కోట్లు కేటాయించగా.. ఇప్పుడు రూ.15 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. ఈ నిధులతో పలు అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, మురుగు కాల్వలు, కుమ్మరికుంట పార్కు, ఆడిటోరియం, బీటీ రెన్యూవల్, సిమెంట్ రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణాలు జరుగుతున్నాయని వారు వివరించారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధను పెడుతున్నదని తెలిపారు. పట్టణంలోని అన్ని లైట్లను ఎల్‌ఈడీ లైట్లను బిగించామని తెలిపారు. పట్టణంలోని ప్రజల మౌలిక వసతులను కల్పించడంలో ప్రభుత్వం పట్టుదలతో ముందుకు వెళ్తున్నదని అన్నారు. తాగునీటి సమస్యను కూడా పరిష్కరించడంలో భాగంగా మిషన్‌భగీరథ నీటిని అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పట్టణంలో గతంలో ఎన్నడు లేని విధంగా అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే జరుగుతున్నదని తెలిపారు. గత ఐదేళ్లుగా అభివృద్ధి నిధులు కేటాయించి పనులు పూర్తి చేయించారని అన్నారు. నర్సంపేటలోనూ హరితహారం ప్రత్యేకంగా నిర్వహించి గ్రీన్‌సిటీగా అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. నర్సంపేటకు అత్యధిక నిధులు కేటాయించడంలో ప్రత్యేక చొరవ చూపినందుకు ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉన్నామని అన్నారు. నర్సంపేటకు నిధులు కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకుడు డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, మునిగాల వెంకట్‌రెడ్డి, దార్ల రమాదేవి,బండి రమేశ్, గుంటి కిషన్, గోగుల రాణాప్రతాపరెడ్డి,చిలువేరు రజనీభారతి, రాయిడి రవీందర్‌రెడ్డి, ఖాజాబీ, కొంకీస జ్ఞాన్‌సాగర్‌గౌడ్, బండి ప్రవీణ్, సుదర్శన్, సారంగం, పుల్లూరి స్వామి, మందుల శ్రీనివాస్, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...