మేడిగడ్డ బ్యారేజీలో 7 టీఎంసీల నీరు


Sat,July 20, 2019 05:55 AM

మహదేవపూర్/కాళేశ్వరం, జూలై 19: మేడిగడ్డ బ్యారేజీలో 7 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు శుక్రవా రం వెల్లడించారు. నాలుగు గేట్లు ఎత్తి సుమారు 10వేల క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నామని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ నుంచి గురువారం రాత్రి వర కు 8 గేట్లను ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు పంపిన అధికారులు.. ప్రాణహిత నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం నాలుగు గేట్లను మూసివేసినట్లు చెప్పారు. శనివారం వరకు బ్యారేజీలోకి వరద ప్రవాహం సాధారణ స్థితికి వస్తే మొత్తం గేట్లను మూసేస్తామని అధికారులు వెల్లడించారు. కాగా, బ్యారేజీలో 8.6 మీటర్ల ఎత్తులో 7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 10వే క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, అంతే ఔట్‌ఫ్లో ఉంది.

కన్నెపల్లి మోటార్లకు విశ్రాంతి
కన్నెపల్లి పంప్‌హౌస్‌లో శుక్రవారం సైతం మోటార్లకు విరామమిచ్చారు. పంపు, మోటార్లను మ్యానువల్ నుంచి ఆటో మోడ్ లోకి తీసుకొచ్చేందుకు ఇంజినీర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి తోడు అన్నా రం బ్యారేజీలో నీరు పెద్దమొత్తంలో చేరింది. అన్నారం పంప్‌హౌస్‌లో మోటార్లను వెట్న్ చేసిన వెంటనే ఇక్కడి మోటార్లను రన్ చేసే అవకాశం ఉంది. కన్నెపల్లి పంప్‌హౌస్‌లో ఇప్పటికే 1వ మో టార్ ఆటో మోడ్‌లోకి వచ్చింది. 2వ మోటార్‌ను ఏక్షణంలోనైనా ప్రారంభించి, నీటిని ఎత్తి పోయనున్నారు. అ న్నారం బ్యారేజీకి 1, 3, 4, 5, 6వ మోటార్ల ద్వార అన్నారానికి 5.65 టీఎంసీల నీటిని తరలించారు. కాళేశ్వరం వద్ద గోదావరిలో 10,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...