20న వర్ధన్నపేటలో జాబ్‌మేళా


Thu,July 18, 2019 03:50 AM

- హాజరుకానున్న 50 ప్రముఖ కంపెనీలు : కలెక్టర్ హరిత
వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వరంగల్ రూరల్ జిల్లాలోని వర్ధన్నపేట నియోజకవర్గకేంద్రంలో ఈ నెల 20న జాబ్‌మేళా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రూరల్ జిల్లా కలెక్టర్ ఎం హరిత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్, డీఆర్‌డీఏ, ఈజీఎంఎం ఆధ్వర్యంలో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. 50 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు జాబ్‌మేళాకు హాజరవుతారని చెప్పారు. నేరుగా ఉద్యోగాలు కల్పించడంతోపాటు అవసరమైన వారికి ఉచిత శిక్షణ సౌకర్యం కూడా ఉంటుందని తెలిపారు. వర్ధన్నపేటలోని శ్రీలక్ష్మీ ఫంక్షన్‌హాలులో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని, నియోజకవర్గ పరిధిలోని వర్ధన్నపేట, ఐనవోలు, హసన్‌పర్తి, పర్వతగిరితోపాటు రాయపర్తి మండలాల యువతీ యువకులు, నిరుద్యోగులు జాబ్‌మేళాకు హాజరుకావాలని కలెక్టర్ హరిత కోరారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెల్త్‌కేర్, సెక్యూరిటీ సర్వీసెస్, రిటైల్, ఆటోమొబైల్, ట్రాన్స్‌పోర్ట్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, మార్కెటింగ్, టెక్స్‌టైల్, ఫార్మా తదితర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. వరంగల్, హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. 5వ తరగతి నుంచి పీజీ చదివిన వారితోపాటు ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్, బీఫాం, ఎంఫార్మ్, డీఫార్మ్ చేసిన వారు ఈ జాబ్‌మేళాలో పాల్గొని ఉద్యోగం పొందాలని కోరారు. జాబ్‌మేళాకు హాజరయ్యేవారు బయోడేటాతోపాటు అప్లికేషన్, రెండు పాస్‌పోర్టుసైజ్ ఫొటోలు, మార్క్స్‌మెమో జిరాక్స్, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డులతో హాజరుకావాల్సి ఉంటుందని తెలిపారు. దివ్యాంగుల కోసం కూడా ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణను రెండు నెలలపాటు శిక్షణ ఇచ్చి ప్లేస్‌మెంట్ కల్పించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రం చేసిన పోలీసులు
పరకాల, నమస్తే తెలంగాణ : పరకాల పోలీస్ స్టేషన్ పరిసరాలను బుధవారం సిబ్బంది శుభ్రం చేశారు. బ్యారక్‌లపై ఉన్న చెత్త నుంచి మొదలుకుని ఆవరణలో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించారు. పరకాల సీఐ జీ మధు ఆధ్వర్యంలో ఎస్సైలు శ్రీకాంత్‌రెడ్డి, రవికిరణ్, కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొన్నారు. ఈ సందర్భంగాఏసీపీ సుధీంద్ర సిబ్బందిని అభినందించారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...