జలసంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి


Wed,July 17, 2019 04:08 AM

దుగ్గొండి, జూలై 16 : భూగర్భజలాల పెంపు కోసం చేపడుతున్న జలసంరక్షణ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ సంపత్‌రావు కోరారు. మంగళవారం దుగ్గొండి మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులకు జలసంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సంపత్‌రావు హాజరై మాట్లాడారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జలసంరక్షణకు ప్రవేశపెట్టిన జలశక్తి అభియాన్‌లో భాగంగా గ్రామాల్లో ఇంటింటికీ ఇంకుడు గుంతలు, ఫాంపాండ్‌లను నిర్మించుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా మొక్కలను విరివిగా నాటి సంరక్షించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో లక్ష్యానికి మించి మొక్కలను నాటాలని సూచించారు. గ్రామ ప్రజాప్రతినిధులు జలశక్తి అభియాన్‌పై సదస్సు నిర్వహించి జలసంరక్షణ చర్యలను తీసుకోవాలన్నారు. నీటివనరులను కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ప్రతీ గ్రామంలో వందశాతం ఇంకుడు గంతలు, మరుగుదొడ్లు, ఫాంపాండ్స్ నిర్మించుకునేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమల, ఏపీడీ పారిజాతం, ఈవోపీఆర్డీ ఖాజామైనొద్దీన్, వైస్ ఎంపీపీ పల్లాటి జేపాల్‌రెడ్డి, వివిద గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు, పాల్గొన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...