నర్సంపేట చరిత్రలో సువర్ణాధ్యాయం


Mon,July 15, 2019 02:54 AM

-ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్‌బెడ్‌రూం వరం
-మొదటి విడత 560, రెండో విడత 400 ఇళ్లనిర్మాణాలు
-నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
-సర్వాపురం శివారులో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన
నర్సంపేట రూరల్‌, జూలై 14 : డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం నర్సంపేట చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని సృష్టిస్తుందని, ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు వరంలాంటివని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేట పట్టణం సర్వాపురం శివారు నర్సంపేట-కొత్తగూడ ప్రధాన రహదారిలోని దామెర చెరువు ఎదురుగా డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పలువురు అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. తొలుత డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం నర్సంపేట తహసీల్దార్‌ విజయభాస్కర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు. గతంలో తాను ఎమ్మెల్యేగా లేకపోయినప్పటికీ పట్టణంలో డబుల్‌బుడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశానన్నారు. పట్టణంలో ఎక్కడ చూసిన గుంట భూమి అమ్మేవారు కన్పించలేదని, దీంతో నిరుపేదల సొంతింటి కళ నెరవేరలేదన్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త దొడ్డ మోహన్‌రావు ఆర్థిక చేయూతతో సర్వాపురం శివారులో 22 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు తెలిపారు. భూ యజమానులకు చిక్కులు లేకుండా నష్ట పరిహా రం అందించి, స్థలాన్ని ఆర్డీవో ద్వారా కలెక్టర్‌కు అందించినట్లు వివరించారు.

తెలంగాణప్రభుత్వం నిరుపేదల పక్షపాతి అని, అందులో భాగంగానే అ న్ని రకాల అనుమతులు ఇచ్చిందన్నారు. అన్ని రకా ల సౌకర్యాలతో నూతన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. మొత్తం 960 డబు ల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు ప్రస్తుతం శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. వీటిలో మొదటి విడతలో 560 ఇళ్ల నిర్మాణం, రెండో విడతలో మిగిలిన 400 ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు వివరించారు. లహరి కన్‌స్ట్రక్షన్‌ అధినేత శ్రీనివాసరావు డబుల్‌బెడ్‌రూం ఇళ్లను నిర్మించేందుకు ముందుకు వచ్చారని, ఏడాది కాలంలోనే పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ప్రతీ నిరుపేదకు డబుల్‌బెడ్‌రూం వస్తుందన్నారు. తెల్లరేషన్‌కార్డు, ఆధార్‌కార్డు కలిగి, పట్టణంలో ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ డబుల్‌బెడ్‌రూం పథ కం వర్తిస్తుందన్నారు. అర్హుల ఎంపిక జాబితా మారో వారం రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం 960 ఇళ్లు మంజూరయ్యాయని, మరో 500 ఇళ్లు తీసుకొస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అంతేగాక ఇంట్రావిలేజ్‌ వర్క్‌లకుగాను రూ.14కోట్లు తీసుకొస్తానని ఆయన హామీ ఇచ్చారు. సొంత స్థలం ఉండి ఇళ్ల నిర్మాణాలకు ముందుకు వచ్చే వారికి సీఎం కేసీఆర్‌ రూ.5.30లక్షలు ప్రణాళికలు రూపొందించారన్నారు.

ఆర్డీవోరవి మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రత్యేక కృషితోనే డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులకు తుదిరూపం వచ్చిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ ఆకుల శ్రీనివాస్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నాగెళ్లి వెంకటనారాయణగౌడ్‌, మాజీ వైస్‌ చైర్మన్‌ మునిగాల పద్మ, మాజీ ఎంపీపీ నల్లా మనోహర్‌రెడ్డి, నీటి సంఘం మాజీ చైర్మన్‌ మునిగాల వెంకట్‌రెడ్డి, కామగోని శ్రీనివాస్‌గౌడ్‌, డాక్టర్‌ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, రాయిడి రవీందర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఎర్ర యాకూబ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితీ మండల కన్వీనర్‌ మోతె జయపాల్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్లు పుట్టపాక కుమారస్వామి, గంప రాజేశ్వర్‌, మాజీ కౌన్సిలర్లు గుంటి కిషన్‌, నాయిని నర్సయ్య, కొంకీస జ్ఞాన్‌సాగర్‌, నాగిశెట్టి ప్రసాద్‌, మండల శ్రీనివాస్‌, బండి ప్రవీణ్‌, శీలం రాంబాబు, పుల్లూరి స్వామి, గోనె యువరాజ్‌, సాంబయ్య, గోగుల రాణాప్రతాప్‌రెడ్డి, పాషా, పెండెం వెంకటేశ్వర్లు, గుడిపూడి అరుణారాంచందర్‌రావు, చిలువేరు రజినీభారతి, మంద ప్రకాశ్‌, నల్లా భారతిరెడ్డి, పెండెం రాజేశ్వరి, గూళ్ల అశోక్‌కుమార్‌, దార్ల రమాదేవి, కొల్లూరి లక్ష్మీనారాయణ, శీలం సత్యనారాయణగౌడ్‌, శ్రీనివాస్‌, వెంకన్న, సారంగం, బైరి మురళి పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...