సుబ్బారావు సేవలు అభినందనీయం : పెద్ది


Sun,July 14, 2019 02:00 AM

నర్సంపేట రూరల్, జూలై 13 : ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను ప్రజలు ఎల్లకాలం గుర్తుంచుకుంటారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, ఇన్‌చార్జి హెచ్‌ఎంగా విద్యార్థులకు ఉత్తమ విద్యనందించి ఉద్యోగ విరమణ పొందిన వేములపల్లి సుబ్బారావు సన్మాన సభ శనివారం పట్టణంలోని ద్వారకపేట ఎంఏఆర్ ఫంక్షన్‌హాల్‌లో జరిగింది. సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి పదవీవిరమణ తప్పదన్నారు. 23 సంవత్సరాలుగా వేములపల్లి సుబ్బారావు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని, రానున్న రోజుల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన పాలుపంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు వృత్తికి అంకితమై విధులు నిర్వర్తించాలని కోరారు. అనంతరం వేములపల్లి సుబ్బారావును ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో పాటు పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శాన ఉమామహేశ్వర్, ఎడ్ల ఉపేందర్‌రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మాలకొండారెడ్డి, ఉపేందర్‌రెడ్డి, కృష్ణవేణి విద్యాసంస్థల అధినేతి మండవ సుబ్బారావు, సిద్ధార్థ, శివాని విద్యాసంస్థల అధినేతలు కంది గోపాల్‌రెడ్డి, మోతె సమ్మిరెడ్డి, పలు ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, ఉపాధ్యాయులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ నర్సంపేట, చెన్నారావుపేట, ఖానాపురం మండలాల అధ్యక్ష, కార్యదర్శులు కడగండ్ల సదయ్య, రవీంద్రాశర్మ, ఈదునూరి రవిందర్‌రెడ్డి, సురేందర్, ప్రసాద్, గండి లింగయ్య, పలువురు హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...