పట్టణ శోభ.. ప్రగతికి తోవ..


Sat,July 13, 2019 01:52 AM

పరకాల, నమస్తే తెలంగాణ : వరంగల్ రూరల్ జిల్లాలోని మున్సిపాలిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్ అంగీకారం తెలపడంతో పట్టణాలు (మున్సిపాలిటీలు) అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. ఇటీవలే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయా మున్సిపాలిటీల అభివృధ్ధికి కావాల్సిన నిధులను ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన మంత్రి దయాకర్‌రావు సీఎం కేసీఆర్‌కు పట్టణాల అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరు చేయాల ని కోరగా ఇందుకు సీఎం అంగీకరించారు. పరకాల మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.25కోట్లు, వర్ధన్నపేట మున్సిపాలిటీకి రూ.18.01కోట్లు మంజూరు చేశారు. ఈ మేరకు పురపాలక శాఖ కమిషనర్ అరవింద్‌కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నిధులతో పట్టణాల రూపురేఖలు మారిపోనున్నాయి. మంజూరైన నిధులకు అభివృద్ధి పనుల ప్రతిపాదనలు కూడా ఇప్పటికే సిద్ధమయ్యాయి. పురపాలక శాఖ ప్రతిపాదనల మేరకు తెలంగాణ పట్టణ, ఆర్థిక వసతుల కల్పన సంస్థ (టీయూఎఫ్‌డీసీ) ఈ నిధులను పట్టణాల్లో అన్నిరకాల మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కోసం వినియోగించునున్నారు. మంజూరైన నిధులతో చేపట్టే పనుల ప్రతిపాదనలకు పురపాలక శాఖ, టీయూఎఫ్‌డీసీ ఇప్పటికే ఆమోదం కూడా తెలిపింది.

నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలకు మొదటి దశ లో నిధులు మంజూరు, పనుల ఆమోదం తెలుపుతూ పురపాలక శాఖ ఈ నెల 8న కూడా ఉత్తర్వులు జారీ చేసింది. నర్సంపేట మున్సిపాలిటీలో రూ.14.97 కోట్లతో, వర్ధన్నపేట మున్సిపాలిటీలో రూ.7.65కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కూడా ఆమోదం లభించింది. జిల్లాలోని మున్సిపాలిటీల అభివృద్ధికి మంత్రి ఎర్రబెల్లి చొరవ తీసుకుని నిధులు మంజూరు చేయించడంపై పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు రూ.82.41 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మహబూబాబాద్, తొర్రూర్, పరకాల, వర్ధన్నపేట మున్సిపాలిటీలకు ఒక్క రోజే రూ.82.41 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. తొర్రూరు మున్సిపాలిటీకి రూ.20కోట్లు, పరకాల మున్సిపాలిటీకి రూ.25కోట్లు, మహబూబాబాద్ మున్సిపాలిటీకి రూ. 19.40 కోట్లు, వర్ధన్నపేట మున్సిపాలిటీకి రూ.18.01 కోట్లు విడుదలయ్యాయి.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...