వృక్షాలే జీవకోటికి ప్రాణదాతలు


Sat,July 13, 2019 01:50 AM

-రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు
రాయపర్తి, జూలై 12 : వృక్షాలే సమాజంలోని సమస్త జీవకోటికి ప్రాణదాతలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. మండలంలోని పెర్కవేడు గ్రామంలో శుక్రవారం ఆయన పర్యటించారు. గ్రామానికి చెందిన బాషబోయిన నరేశ్‌కుమార్, చిన్నాల వంశీకృష్ణ అనే విద్యార్థుల సారథ్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఆయన మొక్కలు నాటా రు. ఈ సందర్భంగా కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ మానవాళికి వృక్షాలతో విడదీయరాని సంబంధాలు ఉందని తెలిపారు. ప్రతిఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాల్సిందిగా ఆయన కోరారు. పంజాబ్ రాష్ట్రంలో విద్యాభ్యాసం చేస్తున్న వంశీకృష్ణ, నరేశ్‌కుమార్ మొక్క లు నాటేందుకు శ్రీకారం చుట్టడాన్ని ఆయన అభినందించారు. మొరిపిరాల, మొరిపిరాల క్రాస్ రోడ్డు (ఆర్ అండ్ ఆర్ కాలనీ) గ్రామాల్లో ఏవో గుమ్మడి వీరభద్రం నేతృత్వంలో భాగంగా మొక్కలు నాటారు. జెడ్పీటీసీ రంగు కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరై గ్రామ సర్పంచ్ చెడుపాక కుమారస్వామితో కలిసి వ్యవసాయ భూముల్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రూరల్ ఆర్డీవో మహేందర్‌జీ, తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, గ్రామ సర్పంచ్ చిన్నాల తారాశ్రీ, ఎంపీటీసీ బండి అనూష, పలు సంఘాలకు చెందిన ప్రతినిధులు బొమ్మెర వీరస్వామి, ఆకారపు వెంకటాచారి, బాషబోయిన సుధాకర్, ఉడుత సాయి, శిరీష, హిమబిందు, మనస్వీని, రాజేశ్, స్థానికులు పాల్గొన్నారు.

జిల్లాలో జోరుగా హరితహారం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడత హరితహారం కార్యక్రమం జిల్లాలో జోరుగా కొనసాగుతోంది. పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు, వనప్రేమికులు ఉత్సాహంగా మొక్కలు నాటారు. మొక్కల ఆవశ్యకతను వివరిస్తూ ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమని, ప్రతిఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో అడవులు శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...