నర్సంపేట అభివృద్ధికి రూ.15 కోట్లు


Thu,July 11, 2019 05:25 AM

- మోడల్, గ్రీన్‌సిటీగా తీర్చిదిద్దాలి
- రెండు రోజుల్లో మిషన్ భగీరథ నీళ్లు
- సమీక్ష లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- పాల్గొన్న ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే పెద్ది

నర్సంపేట, నమస్తే తెలంగాణ : నర్సంపేట పట్టణ అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. నర్సంపేట పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ హరిత, వివిధ శాఖల అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బుధవారం మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 300 మంది రైతులకు సబ్సిడీ విద్యుత్ మోటార్లు, 20 మంది రైతు కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున రైతు బీమా చెక్కులను అందజేశారు.

నర్సంపేట మున్సిపల్ అభివృద్ధికి రూ. 15 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నామని, ఈ నిధులతో చేపట్టబోయే పనులకు సత్వరమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీ రాజ్‌శా ఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. బుధవారం నర్సంపేట ము న్సిపాలిటీలో అభివృద్ధి పనులపై మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ హరిత, వివిధ శాఖల జిల్లా అధికారులు సమీక్ష చేశారు. పట్టణంలో ఇప్పటివరకు రూ.35 కోట్ల తో చేపట్టబోయే పనులను తెలుసుకున్నారు. పట్టణంలో జరుగుతున్న అ భివృద్ధి పనులను వారం రోజుల్లో ప్రారంభించాలని ఆయన అధికారుల ను ఆదేశించారు. పట్టణంలో డివైడర్ల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్‌లు, సెలెడ్ డ్రైనేజీల నిర్మాణం, ఆడిటోరియం, కుమ్మరికుంట పార్క్, జంక్షన్ల అభివృద్ధి, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, శ్మశాన వాటికలు, హరితహారం, మిషన్‌భగీరథ పనులను సత్వరమే వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అ న్నారు. కొన్ని పనులకు టెండర్లు పిలిచామని అధికారులు తెలిపారు. నా లుగు నెలల కిందట టెండర్లు పూర్తయినా పనులు ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. టెండర్లు అయిన తర్వాత ఎన్నికల కోడ్ అడ్డు రాదని తెలిపారు. పట్టణంలోని శ్మశానవాటికలను అన్ని సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఎక్కడ అవసరం ఉన్నాయో అధికారులు గుర్తించి ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. వీటి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించి నర్సంపేటకు రూ.15 కోట్లు మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తాను ఈ నెల 14న వస్తానని మిషన్‌భగీరథ నీటిని పట్టణ ప్రజలకు అందిస్తానని హామీ ఇచ్చారు.

ఎస్సీ, బీస్సీ, మహిళా సంఘాలకు రుణాలు ఇస్తామని తెలిపారు. పట్టణంలో చెత్త చెదారం లేకుండా చేయాల్సిన అవసరం ఉందన్నారు. నర్సంపేట పట్టణాన్ని మోడల్, గ్రీన్‌సిటీగా తయారు చేస్తామని ఆయన తెలిపారు. అందువల్ల ఇంటికి అయిదు మొక్కల పంపి ణీ చేస్తామని, వీటిని ప్రజలు హరితహారంలో నాటించి సంరక్షించే బాధ్యతలను తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు. నాటని, సంరక్షించని వాటికి మున్సిపాలిటీ నుంచి జరిమానాలు విధిస్తామని ప్రకటించాలని సూచించారు. పట్టణంలో ఐపీడీఎస్ పథకంలో రూ.4.56 కోట్ల విద్యుత్ పనులు చేయిస్తున్నామని అన్నారు. ఈ పథకంలోనే డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ స్థలం వరకు విద్యుత్‌లైన్లు నిర్మించే పనులు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులతో ప్రజలు, వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాకాలంలో జబ్బులు పొంచి ఉన్నాయని అన్నారు. పట్టణంలో త్వరలో నిర్మించనున్న డబుల్ బెడ్రూం కాలనీకి కేసీఆర్ నగర్‌గా పేరుపెట్టాలని మంత్రి సూచించారు. నర్సంపేట ఏరియా ఆస్పత్రి పరిధిలో మహబూబాబాద్ జిల్లా పరిధిలోని కొత్తగూడ, గంగారం, గూడూరు ఏజెన్సీ మండలాల ప్రజలు వస్తారని అన్నారు. అందువల్ల రోగులకు కావాల్సిన అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని అన్నారు. నర్సంపేట ఆస్పత్రికి కొత్త బెడ్స్‌ను కేటాయించేందుకు మంత్రి ఈటెల రాజేందర్‌తో మాట్లాడతానని ఆయన తెలిపారు.

నర్సంపేట లాంటి పెద్ద సిటీలకు డంపింగ్ యార్డు లేకపోవడంపై ఎర్రబెల్లి ప్రశ్నించారు. వెంటనే ఎంతదూరంలోనైనా డంపింగ్ యార్డుకోసం స్థల సేకరణ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. నర్సంపేట మాదన్నపేట పెద్ద కాలువలోకి పట్టణంలోని కొన్ని వార్డుల డ్రైనేజీ నీరు వెళ్తున్నదని, దీంతో రైతుల పంటలు దెబ్బతింటున్నందువల్ల పక్కన నాలుగు కిలోమీటర్ల మేరకు ప్రత్యేక డ్రైనేజీ నిర్మాణానికి అధికారులు పరిశీలన చేయాలని సూచించారు. అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సత్వరమే పనులను చేయించేందుకు అవసరంగా కాంట్రాక్టర్లతో మాట్లాడి వేగవంతం చేయాలని తెలిపారు. తాను మళ్లీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తానని, మళ్లీ ఈ పరిస్థితి ఉండొద్దని స్పష్టం చేశారు. తాను ఇప్పుడు ప్రారంభించిన కుమ్మరికుంట పార్క్, ఆడిటోరియం నిర్మాణాల పనులను కూడా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎన్ రవి, కమిషనర్ వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...