మృతదేహం అప్పగింతతో.. ఉత్కంఠకు తెర


Thu,June 20, 2019 03:29 AM

ఎంజీఎం : ఎటు చూసినా రోదనలు.. పెడబొబ్బలు.. మునుపెన్నడూ కనిపించని హృదయ విదారక దృశ్యాలు... ముక్కు పచ్చలారని పసిబిడ్డను మానవ మృగం కబలించిన దుర్ఘటన సభ్య సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.. ఏం జరిగిందనేది తెలియక దారిన వెళ్లేవారు సైతం ఎంజీఎం మార్చూరీ ప్రాంతానికి పరుగులు తీశారు. అభం శుభం తెలియని ఎనిమిది నెలల చిన్నారిపై అత్యాచారం చేసి చంపేశాడని తెలిసి కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ప్రతి ఒక్కరూ ఊగిపోయారు.. ఇంత జరిగాక ఎందుకు ఆలస్యం చేస్తున్నారు..? ఆ నిందితున్ని పట్టుకుని ఎన్‌కౌంటర్ చేయకపోయారా అనే అభిప్రాయాలను ప్రతి ఒక్కరూ నిర్మోహమాటంగా వ్యక్తం చేశారు. నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులే కా కుండా పసిబిడ్డ మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ చేసిన డిమాండ్‌తో ఎంజీఎం దవాఖాన మార్చూరీ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. ఉదయం 6 గంటల నుంచి పాప మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి మృతదేహాన్ని అప్పగించే వరకు ఉద్రిక్తత కొనసాగింది.

హన్మకొండ ఏసీపీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఎటువంటి గొడవలు చోటుచేసుకోకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. హన్మకొండ టైలర్ స్ట్రీట్ పాలజెండా ప్రాంతంలో మంగళవారం రాత్రి 9 నెలల చిన్నారి శ్రీహితను కొలిపాక ప్రవీణ్ అనే కామాంధుడు ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అదే రాత్రి తెల్లవారు జామున ఎంజీఎం మార్చూరీకి తరలించారు. అనూహ్య సంఘటన దావానంలా వ్యాపించడంతో బుధవారం పసిపాప మృతదేహాన్ని చూసేందుకు తండోపతండాలుగా మార్చూరీకి చేరుకోవడంతో ఆ ప్రాంతం అట్టుడికింది. జరిగిన విషయం తెలిసి కన్నీటి పర్యంతమయ్యారు. గతంలో జరిగిన సంఘటనలపై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ఆరోపిస్తూ బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటే నిందితుడిని చంపేయాల్సిందేనని అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం గాకుండా ఉండాలంటే కఠిన శిక్షే ఇందుకు పరిష్కారమార్గమని పేర్కొంటూ మార్చూరీ ఆవరణలో పలువురు ధర్నా చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ప్రశాంత వాతావరణంలో పసికందు మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించేలా ఏసీపీ శ్రీధర్ చర్యలు తీసుకోవడంతో ఎట్టకేలకు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించడంతో ఉద్రిక్తతకు తెరపడింది. కాగా ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని ఎన్‌కౌంటర్ చేస్తేనే ఆత్మస్త్యైర్యం కలుగుతుందని చిన్నారి తాత యాదగిరి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలంటూ తాత యాదగిరి, శ్రీహిత తల్లిదండ్రులు చేతులెత్తి మొక్కుతూ వేడుకున్న దృశ్యం ప్రతీ ఒక్కరిని కదిలించింది.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...