పారిశుధ్య సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహం


Thu,June 20, 2019 03:29 AM

పరకాల, నమస్తే తెలంగాణ : పరకాల పట్టణంలోని 19వ వార్డులోని పారిశుధ్య సిబ్బందిపై బుధవారం పురపాలక సంఘం కమిషనర్ బిర్రు శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్య తనిఖీ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా 19వ వార్డులోని పిట్టవాడ, కుమ్మరివాడ, గౌడ, వడ్ల వాడలలో కమిషనర్ పర్యటించారు. ఈ సందర్భంగా మురికి కాలువలు చెత్తతో నిండి ఉండడాన్ని గమనించిన కమిషనర్ ఆ ప్రాంతంలో పనులు చేసే సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛ పరకాలలో భాగంగా పట్టణమంతా శుభ్రంగా ఉండాలన్నారు. సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వెంటనే కాలువలను శుభ్రం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ కాలనీలో ఉన్న సమస్యలను కమిషనర్‌కు వివరించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ సైడ్ డ్రైన్‌లను ఎప్పటికప్పుడు శుభ్రపర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బండి రాణి రవి, టీపీఎస్ రాజు, టీపీబీవో నవీన్, బిల్ కలెక్టర్లు ఐలయ్య, శ్రీనివాస్, కంప్యూటర్ ఆపరేటర్ కిషోర్, జవాన్లు రాజు, సాంబయ్య, సతీశ్ తదితరులు పాల్గొన్నారు

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...