గుడుంబా స్థావరాలపై దాడులు నమస్తే కథనానికి స్పందన


Thu,June 20, 2019 03:26 AM

గీసుగొండ : మండలంలో గుడుంబాకు తయారీకి అడ్డగా మారిన నందనాయక్‌తండా అనే శీర్షిక బుధవారం నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురితం కావడంతో ఎక్సైజ్ పోలీసులు మేల్కొన్నారు. బుధవారం నందనాయక్‌తండా, దుస్రుతండా,కొత్తతండా, రత్తిరామ్‌తండా, దూద్యతండా, మంగల్‌తండాల్లో డీటీఎఫ్ సీఐ కరంచంద్, ఎక్సైజ్ సీఐ జగన్నాథరావు ఆధ్వర్యంలో పోలీసులు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. నందనాయక్‌తండాలో పొలాల వద్ద భూమిలో పాతిపెట్టిన బెల్లం పానకం డ్రమ్‌లను గుర్తించి వాటిని బయటకు తీసి ధ్వంసం చేశారు. నిందితుడు పరారీలో ఉన్నందున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జగన్నాథరావు తెలిపారు. తండాల్లో గుడుంబా విక్రయించినా తయారు చేసినా పీడీయాక్టు కేసులను నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. ఈకార్యక్రమంలో ఎస్సైలు పద్మ, సిబ్బంది పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...