గుండెపోటుతో ఆర్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ మృతి


Thu,June 20, 2019 03:26 AM

దుగ్గొండి : గుండెపోటుతో రైతు సమన్వయసమితి గ్రామ కోఆర్డినేటర్ మృతిచెందిన ఘటన మండలంలోని చాపలబండలో బుధవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ యువజన నాయకుడు, గ్రామ ఆర్‌ఎస్‌ఎస్ కోఆర్డ్డినేటర్ గుడిపెల్లి రాజేందర్‌రెడ్డి (34) గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మంగళవారం తన వ్యక్తిగత పనుల నిమిత్తం వెళ్లి తిరిగి తన ఇంటికి వచ్చి తన కుటుంబసభ్యులతో కలిసి నిద్రిస్తున్న క్రమంలో బుధవారం తెల్లవారు జామున గుండె నొప్పి వస్తుందని కుటుంబసభ్యులకు తెలిపాడు. దీంతో కుటుంబసభ్యులు ప్రాథమిక చికిత్స నిమిత్తం ఆర్‌ఎంపీ వైద్యుడితో చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్‌కు దవాఖానకు తరలించే క్రమంలో రాజేందర్‌రెడ్డి మృతి చెందాడు.మృతుడికి తండ్రి కోమల్‌రెడ్డి, తల్లి కలమ్మ ఉన్నారు. రాజేందర్‌రెడ్డి మృతితో చాపలబండ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...