గంగ దేవిపల్లిని సందర్శించిన


Wed,June 19, 2019 02:28 AM

- అధికారులు, ప్రజాప్రతినిధుల బృందం
గీసుగొండ, జూన్ 18 : ఆదర్శ గ్రామం గంగదేవిపల్లిని మంగళవారం నల్లగొండ జిల్లా కనగల్ మండలం మూర్తినేనిగూడెం సర్పంచ్ బండమీదిరాము ఆధ్వర్యంలో వార్డు సభ్యులు గ్రామాన్ని సందర్శించి గ్రామాభివృద్ధిని తెలుసుకున్నారు. అలాగే రూరల్ జిల్లా చెన్నారావుపేట మండల ఎంపీడీవో చందర్ ఆధ్వర్యంలో 30 గ్రామాల కార్యదర్శుల బృందం గ్రామాన్ని సందర్శించి గ్రామాభివృద్ధిని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన సమావేశంలో శిక్షణ మేనేజర్ కూసం రాజమౌళి అధికారుల, ప్రజాప్రతినిధుల బృందానికి గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని వారికి క్లుప్తంగా వివరించారు. గ్రామంలో 24 అభివృద్ధి కమిటీలు పనిచేస్తున్నట్లు తెలిపారు. గ్రామస్థాయిలో పనిచేస్తున్న కార్యదర్శులు గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు ప్రణాళికలు, కమిటీల పనితీరును వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృధ్ధికై ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి ని సీఎం కేసీఆర్ గంగదేవిపల్లి గ్రామంలో ప్రవేశపెట్టారన్నారు. గ్రామం అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించి దేశానికే రోల్‌మాడల్‌గా నిలువాలనే ఉద్దేశంతో పది కోట్ల నిధులను మంజూరు చేశారని వారికి వివరించారు. పది కోట్ల నిధులతోనే గంగదేవిపల్లి గ్రామంలో డబుల్ రోడ్లు, సైడ్‌డ్రైన్, వైఫై సేవలు, సోలార్ విద్యుత్, గ్రామానికి లింకు రోడ్లను వేసుకున్నామని సూచించారు. అలాగే గ్రామంలోని రెండు చెరువులను మరమ్మతులు చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం ఎంపీడీవో చందర్ మాట్లాడుతూ గంగదేవిపల్లి తరహాలో కార్యదర్శులు మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కార్యదర్శులకు కమిటీలు, ప్రజల భాగస్వామ్య పై అవగాహన కోసమే గంగదేవిపల్లి సందర్శనకు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో గంగదేవిపల్లి సర్పంచ్ మల్లారెడ్డి, జిల్లా పరషత్ శిక్షణ మేనేజర్ కర్ణాకర్, కార్యదర్శులు మాలతి, పద్మనాభస్వామి, నర్సయ్య, జిల్లా శిక్షణ కమిటీ సభ్యులు సరోజన పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...