ఆసరా పెన్షన్లపై ఆరా..!


Tue,June 18, 2019 02:45 AM

-బయటపడుతున్న అక్రమాలు
వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఆసరా లేని అభాగ్యులకు అండగా నిలవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఆసరా పింఛన్ల అక్రమాలు, అక్రమార్కుల గురించి పైరవీకారుల వివరాలపై నిఘావర్గాలు ఆరా తీస్తున్నాయి. రాష్ట్ర ప్రభు త్వం ఆసరా పెన్షన్లతో ఆర్థికంగాలేని అభాగ్యులను ఆదుకోవాలనే సంకల్పంతో పకడ్బంధీగా అమలుచేస్తున్న ఆసరా పెన్షన్ల పథకాన్ని రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదేక్రమంలో పైరవీకారులు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడం, పెన్షన్ల కోసం నిబంధనలకు విరుద్ధంగా దస్తావేజులను సృ ష్టించి లబ్ధిపొందుతున్న అక్రమార్కుల వివరాలు బయటపడుతున్న తీరు నిఘావర్గాలను, అధికార యంత్రాంగాన్ని నివ్వెరపరుస్తున్నాయి. వరంగల్ రూరల్ జిల్లావ్యాప్తంగా 16మండలాలు, 401గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటి ల్లో 95,528 మందికి వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, గీత, చేనేత, ఒంటరి మహిళలతోపాటుగా బీడీకార్మికుల, బోధకాలుగ్రస్తులకు పెన్షన్లు అందిస్తున్నది. ప్రతీ నెల రూ.11కోట్ల 45లక్షల 89వేల 500లను ఆసరా పెన్షన్లలో భాగంగా జిల్లాలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. ఇప్పటివరకు రూ.వెయ్యి అందించిన ప్రభుత్వం వచ్చేమాసం నుంచి రూ.2016అందించనున్నది.

57ఏళ్లు నిండిన అర్హులైన ప్రతీ ఒక్కరికి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడంతోపాటుగా బీడీ కా ర్మికులు, చేనేత కార్మికులు, గీతా కార్మికులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బోధకాలుగ్రస్తులకు న్యాయబద్ధంగా పెన్షన్ అందిస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలుచేస్తున్నారు. ఇదేక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల్లో పైరవీకారులు పుట్టగొడుగుల్లా పుట్టుకువచ్చి ఆధార్‌కార్డులను మార్ఫింగ్ చేయించి అర్హతకు తగిన వయస్సును సరిచేయించడం, కొన్నిచోట్ల బీడీ కార్మికుల పేరుతో పెన్షన్ ఇప్పిస్తామంటూ అనుమతులు లేని ప్రైవేట్ కంపెనీలు కార్మికుల వద్ద డబ్బులు వసూలు చేయడం, వికలాంగులకు తగిన ప ర్సంటేజీ లేనప్పటికీ పెన్షన్లు ఇప్పిస్తామంటూ డబ్బులు వ సూలు చేస్తున్నతీరు పైరవీకారుల పైసల వసూళ్లు, అక్రమార్కుల వక్రబుద్ధి అభాగ్యులకు జరుగుతున్న అన్యాయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్నిచోట్ల ఇప్పటికే పెన్షన్ పొం దుతున్నవారిలో ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. విచారణలో ఇవన్నీ వెలుగుచూస్తుండడంతో నిఘావర్గాలు ఆశ్చర్యానికి గురవుతున్నాయి. దీనికితోడు మండల, జిల్లా అధికారులు కూడా వెలుగుచూస్తున్న సాఫల్యవైఫల్యాలపై రకరకాల సందేహాలను వ్యక్తంచేస్తున్నారు. గత ఐదేళ్లుగా ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పెన్ష న్లు అర్హులకు కాకుండా ఎక్కడైనా అనర్హులకు అందుతున్నా యా..? అనే విషయంలో కూడా ఆ వర్గాలు విచారణ జరుపుతున్నాయి. కొన్నిచోట్ల ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా పెన్షన్లు వస్తున్న సందర్భాలు వెలుగుచూస్తున్నట్లు సమాచారం.

జిల్లాలోని ఆసరా పెన్షన్ల వ్యవహారంలో అక్కడక్కడ అనర్హులే పెన్షన్లు పొందడంలో ముందన్నట్లు భావిస్తున్న అధికారగణం మరోసారి క్రాస్‌చెక్ చేసుకునే ప నిలో నిమగ్నమైంది. క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారులు పలుచోట్ల చేసిన తప్పిదాల వల్లే ఈ చిన్నచిన్న పొరపాట్లు జరిగి అక్కడక్కడ అనర్హులు, ఒకే ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు పెన్షన్లు తీసుకున్న సందర్భాలు పొడచూపాయని, దీంతో ప్రభుత్వ లక్ష్యం సంపూర్ణంగా నెరవేరడంలేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకవెళ్లేలా నిఘావర్గాలు, అధికారవర్గాలు నివేదికలు సి ద్ధం చేస్తున్నట్లు తెలిసింది. వరంగల్ రూరల్ జిల్లాలో అన్నిరకాల ఆసరా పెన్షన్లు 95,528మందికి అందుతుండగా వీటిలో వృద్ధాప్య పెన్షన్లు 37,665, వితంతు పెన్షన్లు 35, 242, వికలాంగులకు 13,393మందికి, 3,261 మంది గీతా కార్మికులకు, 1,509మంది చేనేత కార్మికులు, 2,415 మంది ఒంటరి మహిళలు, 2,043 మంది బీడీ కార్మికులు కలిపి నెల ఒక్కంటికి రూ.11,45,89,500 లబ్ధిపొందుతున్నారు. వికలాంగులు రూ.1,500చొప్పున, రూ.వెయ్యి చొప్పున మిగతా ఆసరా పెన్షన్ లబ్ధిదారులు పొందుతున్నారు.

ఈ మొత్తం పెన్షన్‌దారులు గత ఐదేళ్లుగా లబ్ధిపొందుతుండగా పెరిగిన పెన్షన్ వచ్చే నెల నుంచి అందనున్న నే పథ్యంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన పైరవీకారులు పె న్షన్ల పేరుతో ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో అనర్హులు లబ్ధిపొందుతున్నారని నిఘా వర్గాలు ప్రభుత్వానికి సమాచారం చేరవేస్తు న్న సందర్భంలోనే పెరిగిన పెన్షన్లను ఎరగా వేస్తూ ప్రజలను మోసంచేసే క్రమంలో పైరవీకారులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. అక్రమార్కులపై కొరఢా ఝుళిపేందుకు అధికారయంత్రాంగం సిద్ధమవుతుండగా అర్హుడైన నిజమై న ప్రతీ లబ్ధిదారుకి పెన్షన్ అందాలని ప్రభుత్వం చెబుతున్నది. అదేక్రమంలో అక్రమార్కులపై కూడా దృష్టిసారిస్తున్నది. నిఘావర్గాలు, అధికారయంత్రాంగం ఆరా తీస్తుండడంతో దళారులు, పైరవీకారులు, అర్హతలేకుండా లబ్ధిపొందుతున్న పెన్షన్‌దారుల గుండెల్లో రైళ్లుపరిగెడుతున్నాయి.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...