విద్యాభివృద్ధితోనే బంగారు తెలంగాణ


Tue,June 18, 2019 02:44 AM

-ఉత్తమ విద్యాలయాలుగా గురుకులాలు
-ప్రతీ విద్యార్థికి కార్పొరేట్ స్థాయిలో విద్య
-నిరుపేదలకు అండగా సీఎం కేసీఆర్
-నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
-గిర్నిబావిలో బీసీ గురుకుల పాఠశాల ప్రారంభం
దుగ్గొండి, జూన్ 17 : తెలంగాణ రాష్ట్రంలో పేద, ధనిక తేడా లేకుండా ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున రెసిడెన్షియల్ గురుకులాన్ని ప్రారంభించి, విద్యార్థుల పాలిట సీఎం కేసీఆర్ వరమయ్యారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేట నియోజకవర్గానికి మంజూరైన మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయాన్ని మండలంలోని గిర్నిబావిలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. రెసిడెన్సియల్ గురుకులం ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేకు విద్యార్థులు ఘనస్వాగతం పలికి మార్చ్‌పాస్ట్‌తో సభాస్థలికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గురుకులం ప్రత్యేకాధికారి దేవేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులతో కలిసి జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యతో సమాభివృద్ధి సాధ్యమని నమ్మి తన సొంత ఆలోచలనతో కేజీ టూ పీజీ ఉచిత విద్యనందంచడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ గురుకులాలను ప్రారంభించినట్లు తెలిపారు.

మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకులాలను ఉత్తమ విద్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. సీఎం కలలు కన్న బంగారు తెలంగాణ ఉత్తమ విద్యతోనే సాధ్యమన్నారు. కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యను అమలు చేసి, రెసిడెన్షియల్ విద్యావిధానంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు పడుతున్నాయన్నారు. ప్రవేశపరీక్షల ద్వారా సీట్లు సాధించిన విద్యార్థులు లక్ష్యంతో విద్యనభ్యసించి ఉన్నత స్థాయిలో స్థిరపడాలన్నారు. విద్యాభివృద్ధి తోనే సమాజంలో మంచి గుర్తింపు వచ్చి ఉత్తమ పౌరులుగా ఎదుగుతారన్నారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి నర్సింహస్వామి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, రెసిడెన్షియల్ గురుకులం కోఆర్డినేటర్ మనోహర్‌రెడ్డి, ప్రిన్సిపాళ్లు రాజేందర్‌ప్రసాద్, కే దేవేందర్, దుగ్గొండి ఎంపీడీవో పల్లవి, తహసీల్దార్ మంజుల, గిర్నిబావి సర్పంచ్ కూస మమత రాజు, ఎంపీపీ సుశీల, జెడ్‌పీటీసీ సుకినె రజితరాజేశ్వర్‌రావు, వైస్ ఎంపీపీ ఊరటి మహిపాల్‌రెడ్డి, ఎంపీటీసీలు పల్లాటి జైపాల్‌రెడ్డి, లావుడ్య లలితాశ్రీనుబాబునాయక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...