ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య


Tue,June 18, 2019 02:43 AM

-ఉత్తమ ఉపాధ్యాయులతో ప్రత్యేక తరగతులు
-మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు
-జిల్లా కలెక్టర్ హరిత
దామెర, జూన్ 17: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. సోమవారం దామెర మండల కేంద్రంలోని ప్రభు త్వ పాఠశాలలో బడిబాట, సామూహిక అక్షరభ్యాసం కార్యక్రమానికి కలెక్టర్, వరంగల్ ఆర్‌జేడీ, జిల్లా డీఈవో రాజీవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పా టు చేసిన సమావేశంలో కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తూ వి ద్యార్థుల భవిష్యత్‌ను బంగారుమయంగా చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నదన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులను చైతన్యం చేస్తూనే విద్యాబోధనపై ఉపాధ్యాయులకు కూడా అవగాహన కల్పిస్తూ ఆధునిక విద్యను ప్రోత్సహిస్తూ కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్నదన్నారు. జిల్లాలో 669 పాఠశాలల్లో ఎంతో మంది విద్యార్థులు విద్యన అభ్యసిస్తున్నారని వారందరికీ ఉచితంగానే పుస్తకాలు, డ్రెస్‌లు, పెన్నులు, పెన్సిల్స్ అందిస్తున్నదని చెప్పారు. 3, 4, 5వ తరగతి విద్యార్థులకు కూడా భాషాపరిజ్ఞానం పెంపొందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల చుదువుపై కూడా గ్రౌండ్ స్థాయిలో పరీక్షలను నిర్వహించి మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. 2017-18విద్యాసంవత్సరంలో 12 పాఠశాలల్లో పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించగా 2018-19 విద్యాసంవత్సరంలో వంద పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించగా 14 పాఠశాలల్లో 10/10జీపీఏ సాధించడం ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య ఎలా ఉందో స్పష్టం చేస్తున్నదని ఆమె అన్నారు.

ప్రతీ సంవత్సరం నవంబర్ నెలలోనే సెలబస్‌ను పూర్తిచేసి మిగతా నెలల్లో సెలబస్ రివిజన్ చేయాలని ఉపాధ్యాయులకు సూచించినట్లు తెలిపారు. గత పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం సమయంలో సెలబస్ రివిజన్ సమయంలో రూ.10లక్షలు వెచ్చించి విద్యార్థులకు టీ, బిస్కెట్స్ అందించామన్నారు. ప్రతీ సంవత్సరం విద్యతోపాటు ఈ కార్యక్రమాన్ని జిల్లా అధికారి, తహసీల్దార్, హెచ్‌ంలు పర్యవేక్షిస్తారన్నారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలే మేలనే విషయాన్ని చెప్పేందుకు ప్రభుత్వపరంగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ పాఠశాలలో టాయ్‌లెట్స్, బాత్‌రూమ్స్, రన్నింగ్‌వాటర్, రిపేరింగ్ కోసం రూ.3.13లక్షలను కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు కూడా పట్టుదల, శ్రద్ధ్దతో చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. ఈ సందర్భంగా దామెర హై స్కూల్‌కు చెందిన మేరుగు తిరుపతి పదో తరగతిలో 9.8జీపీఏ సాధించగా ఆ విద్యార్థిని కలెక్టర్ శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ, రూరల్ డీఈవో రాజీవ్, ఆర్డీవో కిషన్, ఎంపీడీవో నర్మద, ఈవోపీఆర్డీ వెంకటేశ్వర్లు, డీటీ హేమ, ఎంఈవో కొంగర సారయ్య, హెచ్‌ఎంలు ఎన్ రవీందర్, దాసు కుమారస్వామి, ఆర్‌ఐ రాం బాబు, ఎంపీపీలు మల్లికార్జున్, కాగితాల శంకర్, జెడ్పీటీసీలు సంజీవరెడ్డి, గరిగె కల్పనకృష్ణమూర్తి, సర్పంచ్ శ్రీరాంరెడ్డి, ఎంపీటీసీ పోలం కృపాకర్‌రెడ్డి, ఎస్‌ఎంసీ చైర్మన్లు శ్రీనివాస్, బైకాని రాజు, పొలుసాని శ్రీనివాస్‌రెడ్డి, కొమ్మాలు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...