జర్నలిస్టు సంక్షేమ నిధికి దరఖాస్తుల ఆహ్వానం


Tue,June 18, 2019 02:43 AM

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జర్నలిస్టు సంక్షేమ నిధి నుంచి మంజూరు చేసే ఆర్థికసాయం కోసం ఈ నెల 24వ తేదీ వరకు అర్హత గల జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2014 జూన్ 2 తరువాత మరణించిన జర్నలిస్టులకు సంబంధించిన కుటుంబ సభ్యులు, జర్నలిస్టు వృత్తిలో ఉంటూ అనారోగ్యం బారిన పడి పనిచేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులు మాత్రమే ఈ ఆర్థిక సాయాన్ని దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. గతంలో సంక్షేమ నిధి నుంచి లబ్ధిపొందినవారు, ఇప్పటికే మీడియా అకాడమీకి దరఖాస్తులు పంపినవారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత పౌరసంబంధాల అధికారులైన ఉప సంచాలకులు, సహాయ సంచాలకులు, డీపీఆర్వోల ద్వారా ధ్రువీకరించిన దరఖాస్తులను మీడియా అకాడమీ కార్యాలయానికి పంపించాలని కోరారు. ఇప్పటి వరకు 208 మంది మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున, 72 మంది అనారోగ్యానికి గురైన వారికి రూ.50వేల చొప్పున ఆర్థికాసాయం అందించినట్లు అల్లం నారాయణ పేర్కొన్నారు. అదేవిధంగా రూ.3వేల చొప్పున పెన్షన్ కూడా అందిస్తున్నట్లు చెప్పారు. 144 మంది పిల్లలకు రూ.వెయ్యి చొప్పున ట్యూషన్ ఫీజు అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ కార్యదర్శి, హైదరాబాద్ 10-2-1, సమాచార భవన్, 2వ అంత స్తు, ఏసీ గార్డ్స్, మసాబ్‌ట్యాంక్, తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాద్‌కు దరఖాస్తులను పంపించాలన్నారు. మరిన్ని వివరాలకు 040-23298672, 23298674లో సంప్రదించాలని కోరారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...