మిషన్ భగీరథ పనులను పూర్తిచేయాలి


Tue,June 18, 2019 02:43 AM

ఖానాపురం, జూన్ 17 : మిషన్ భగీరథ పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ వెంకట్రాంరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం మనుబోతులగడ్డలో మిషన్ భగీరథ పనులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం పనులు వంద శా తం పూర్తికావచ్చాయన్నారు. కొన్ని చోట్ల సాంకేతిక కారణాలతో పనులు నిలిచిపోయాయని వాటిని వెంటనే పూర్తిచేసే విధంగా కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. పనులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులైనన,కాంట్రాక్టర్లనైన ఉపేక్షించేది లేదన్నారు. కార్యక్రమంలో ఏఈ మౌనిక పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...