సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం


Tue,June 18, 2019 02:42 AM

నర్సంపేట రూరల్, జూన్ 17 : సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కల్పించడంతో గ్రామాల్లోని ప్రజాప్రతినిధుల్లో హర్షాతిరేకాలు వ్యక్త మవుతున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించారు. సోమవారం మండలంలోని ఇటుకాలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ మండల రవీందర్, ఉప సర్పంచ్ జమాండ్ల చంద్రమౌళి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్, ఉప సర్పంచ్‌కు చెక్ పవర్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం హర్షించదగిన విషయమన్నారు. గత ఐదు నెలలుగా చెక్ పవర్ కోసం ఎదురు చూస్తుండగా ప్రభుత్వం స్పందించి మంచి నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో గ్రామాలన్నీ అభివృద్ధి దిశగా అడుగులువేస్తాయని తెలిపారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కట్ల సుధాకర్‌గౌడ్, వార్డు సభ్యులు బొడిగె వినయ్, బోరగాని కృష్ణ, తాళ్లపల్లి కల్పన, బత్తిపాక మంజుల, సోనబోయిన రణధీర్, బూడిద వసంత, బుర్ర రజిత, ఎండీ సుభాన్, లకిడె రాజేశ్వరరావు, గోనె నాగరాజు, సంపత్, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులున్నారు. అదేవిధంగా మండలంలోని రామవరం, ముత్తోజిపేట గ్రామాల్లో కూడా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...