ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్, ఉపసర్పంచ్ పిల్లల చేరిక


Tue,June 18, 2019 02:42 AM

చెన్నారావుపేట, జూన్ 17 : అక్కల్‌చెడ ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ తూటి పావని, ఉపసర్పంచ్ బానోతు వీరన్న తమ పిల్లలను చేర్పించారు. సోమవారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లి సర్పంచ్ తమ ఇద్దరు పిల్లలు రక్షిత్ సెంకడ్ క్లాస్, సాత్విక్ ఎల్‌కేజీ, ఉపసర్పంచ్ తమ కూతురు నిహారికను సెకండ్ క్లాస్‌లో చేర్పించి ప్రధానోపాధ్యాయుడు రవిచంద్ర వద్ద అడ్మిషన్లను తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను కాపాడుకునేందుకే తమ పిల్లల్ని పాఠశాలలో చేర్పించినట్లు తెలిపారు.అలాగే ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని వారు కోరారు. ఈ సందర్భంగా తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపించకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినందుకు గ్రామస్తులు.. సర్పంచ్, ఉపసర్పంచ్‌ను అభినందించారు. వార్డు సభ్యులు ఈర్ల అనూష, శ్రీనివాస్, రవి, స్వామి, అశోక్, లలిత, కిష్టు, ఎఫ్‌ఏ ఫజల్, రమేశ్, హయాజ్, ఖయాజ్, శివ పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...