పాకాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి


Tue,June 18, 2019 02:42 AM

ఖానాపురం, జూన్17 : పాకాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఏపీసీసీఎఫ్ లోకేష్ జైస్వాల్ అన్నారు.ఈ మేరకు ఏపీసీసీఫ్ లోకేష్ జైస్వాల్ సోమవారం సీసీఎఫ్ అక్బర్‌తో కలిసి పాకాలలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అదేవిధంగా అశోక్‌నగర్‌లో బీట్ పరిధిలో జరుగుతున్న పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన పాకాల ఔషధ మొక్కల పార్కును, జిప్‌లైన్ పనులను బట్టర్‌ైఫ్లె పార్కును, బర్డ్ వాచింగ్ పాయింట్‌ను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ పాకాలను జిల్లాలోనే పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అనువైన వాతావరణం ఉండడంతో ప్రభుత్వం పాకాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని అన్నారు. పాకాలలో పెద్ద ఎత్తున మొక్కలను నాటి పూర్వవైభవం తీసుకురావాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ పురుషోత్తం, ఎఫ్‌ఆర్వో, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ అధికారులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...