ఆన్‌లైన్ పీజీసెట్‌పై విద్యార్థులకు అవగాహన సదస్సు


Tue,June 18, 2019 02:41 AM

నర్సంపేట,నమస్తేతెలంగాణ : పీజీసెట్ ఆన్‌లైన్ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు సిద్ధార్థ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ గోగుల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం నర్సంపేటలోని కళాశాలలో ఆన్‌లైన్ పరీక్షలు రాసే విద్యార్థులకు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ కూడా నిర్ణిత లక్ష్యాన్ని ఏర్పరచుకుని, దాని సాధనకు కృషి చేసినప్పుడు మాత్రమే ఉజ్వల భవిష్యత్ ఏర్పడుతుందన్నారు. ఉన్నత చదువులు చదివిన వారికి మాత్రమే అన్ని రంగాల్లో అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. పీజీ విద్యను అభ్యసించడం వల్ల మేలు కలుగుతుందని తెలిపారు. అనంతరం పీజీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత మెటీరియల్‌ను పంపిణీ చేశారు. అలాగే, వివిధ సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు ఉన్న అనుమానాలను అధ్యాపకుల చేత నివృత్తి చేయించారు. కార్యక్రమంలో అధ్యాపకులు రాజేశ్, సుధాకర్, రాంబాబు, నిజాం పాల్గొన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...