విలీన గ్రామాల సమగ్రాభివృద్ధ్దికి ప్రణాళికలు


Mon,June 17, 2019 03:31 AM

వరంగల్,నమస్తేతెలంగాణ : విలీన గ్రామాల సమగ్రాభివృద్ధ్దికి ప్రణాళికలు రూపొందించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కార్పొరేషన్ కౌన్సిల్‌హాల్‌లో ఆయన విలీన గ్రామాల అభివృద్దిపై కార్పొరేటర్లతో కలిసి అధికారులతో నియోజకవర్గం పరిధిలోని డివిజన్ల వారిగా సమీక్షా నిర్వహించారు. విద్యుత్, పారిశుద్ద్యం, తాగునీటి సరఫరాపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్ కారొరేషన్‌లో విలీనమైన గ్రామాలు ఇప్పటికి అదే స్థితిలో ఉన్నాయని అన్నారు. ఎలాంటి పురోగతి సాధించలేదని అన్నారు. ప్రస్తుతం విలీన గ్రామాల్లో మౌలిక వసతుల కోసం ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు.ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో విలీన గ్రామాల అభివృద్ధ్దిని పరుగులు పెట్టించాలని అన్నారు. హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా పేరున్న గ్రేటర్ వరంగల్‌పై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని అన్నారు. అధికారుల అదే శ్రద్ధ్దతో అభివృద్ధ్ది పనులలో వేగం పెంచాలని అన్నారు. వాటర్ గ్రిడ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. కార్పొరేటర్లను సమన్వయం చేసుకుని అధికారులు ముందుకు పోవాలని అన్నారు. అభివృద్ధ్దిలో కార్పొరేటర్లను భాగస్వామ్యం చేయాలని సూచించారు. విలీన గ్రామాలలో పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న సంఖ్యను తగ్గించకుండా చూడాలని అన్నారు. రాబోయే వర్షాకాలం నేపథ్యంలో డ్రైనేజీలు శుభ్రం చేయాలని అన్నారు. అవసరం ఉన్న ప్రాంతాల్లో కచ్చకాలువలు తవ్వాలని అన్నారు. తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని అన్నారు. విలీన గ్రామాల్లో ట్యాంకర్ల సంఖ్య పెంచాలని అన్నారు. కార్పొరేటర్లతో కలిసి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లితే సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయని అన్నారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధ్ది పనులకు టెండర్లు పిలువాలని సూచించారు. టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి అభివృద్ధ్ది పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కమిషనర్ రవికిరణ్ మాట్లాడుతూ..సీఎంహామీ, జనరల్ ఫండ్ నిధుల నుంచి రూ.145 కోట్లతో 1013 పనులు చేపట్టినట్లు వివరించారు. 619 పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయని, 216 పనులు పురోగతిలో ఉన్నాయని, 5 పనులు అగ్రిమెంట్ దశలో ,41 పనులు టెండర్ ప్రక్రియలో ఉన్నాయని వివరించారు. కార్పొరేటర్లను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధ్ది పనులను ముందుకు తీసుకపోతామని అన్నారు. పైప్‌లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ఇంటింటికి నల్లా కనెక్షన్లు అందచేస్తామని అన్నారు. గేట్ వాల్వ్, చిన్నచిన్న పనులను నామినేషన్ పద్ధతిలో పూర్తి చేస్తామని అన్నారు. తడి, పొడి చెత్తలను రీసైక్లింగ్ చేసి పనికిరాని చెత్తను మాత్రమే డంపింగ్ యార్డుకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. స్వీపింగ్ మిషన్ల కోనుగోలుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. యంత్రాలు వినియోగంతో కార్మికుల పని భారం తగ్గుతుందని అవసరం ఉన్న చోట్ల కార్మికుల సంఖ్య పెంచేందుకు అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. అధికారులు బాధ్యాతాయుంగా పని చేసి విలీన గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో కార్పొరేటర్లు వీర భిక్షపతి, లాదేళ్ల బాలయ్య, జోరిక రమేశ్, బస్కె శ్రీలేఖ, నరోత్తం రెడ్డి, బానోతు కల్పన, తూర్పాటి సులోచన, పసునూరి స్వర్ణలత, గగులోతు రాజు, జక్కుల వెంకటేశ్వర్లు, సిరంగి సునిల్ కుమార్, సీపీ నర్సింహచారి, ఎంహెచ్‌వో డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్‌వో సునీత, ఈఈలు రాజయ్య, లకా్ష్మరెడ్డి, శ్రీనివాసరావు, డీసీపీ నర్సింహరాములు, డీఈలు రవిందర్, సంజయ్,సంతోశ్, స్వరూపారాణి, నరేందర్, ఏసీపీలు గణపతి, సాంబయ్య, హెచ్‌వో మురళీమోహన్, సానిటరి సూపర్‌వైజర్ సుధాకర్, టీపీబీవోలు పాల్గొన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles