హైటెక్‌ హంగులతో మోడల్‌ పీఎస్‌లు


Sun,June 16, 2019 03:31 AM

-ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో నేరాలు తగ్గిపోయాయి
-నేరాల నియంత్రణలో వరంగల్‌ పోలీసుల పనితీరు భేష్‌
-ఎమ్మెల్యే, ఎంపీలు సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలి
-మోడల్‌ పీఎస్‌ సందర్శనలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ
హసన్‌పర్తి, జూన్‌ 15: హైటెక్‌ హంగులతో మోడల్‌ పోలీస్‌స్టేషన్ల భవనాలు ఉన్నాయని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. మండల కేంద్రంలోని మో డల్‌ పీఎస్‌ను ఆయన మొట్ట మొదటి సారిగా సందర్శించారు. ఈ సందర్భంగా వరంగల్‌ నగర పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ విశ్వనాథ్‌ రవీందర్‌ పుష్పగుచ్చం అందజేసి హోంమంత్రికి పోలీసు లాంఛనాలతో స్వాగతం పలికారు. అనంతరం హోంమంత్రి మోడల్‌ పీఎస్‌లో సన్నిహిత కౌంటర్‌, రైటర్‌ రూం, కోర్టు ఫైల్స్‌ రికార్డు రూం, సీసీ కెమెరాలు, బ్లూకోల్ట్స్‌ సిబ్బంది, పోలీస్‌ అడ్మినిస్ట్రేషన్‌, పోలీసుల వారిగా విధులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నగర పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ విశ్వనాథ్‌ రవీందర్‌ సిబ్బంది పనితీరును మంత్రికి వివరించారు. అనంతరం పోలీసు స్టేషన్‌ ఆవరణలో హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌, నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌, సీపీ డాక్టర్‌ విశ్వనాథ్‌ రవీందర్‌ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో హైటెక్‌ హంగులతో పోలీసు స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు.

సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
ఎమ్మెల్యేలు, ఎంపీలు, నగర మేయర్‌ తమ తమ నిధుల నుంచి ప్రతీ గ్రామంలో, కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు నిధులు కేటాయించాలని కోరారు. సీఎం కేసీఆర్‌కు పోలీసులపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానంతో నేరాల నియంత్రణకు కృషి చేస్తున్న వరంగల్‌ పోలీసుల పనితీరును కొనియాడారు. బంజరాహిల్స్‌లో రూ.300 కోట్లతో పోలీస్‌ కమాండ్‌ కంట్రోలింగ్‌ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని, మరో మూడు నెలల్లోనే పూర్తవుతుందని చెప్పారు. అర్బన్‌ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ దయానంద్‌, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ నర్సింగరావు, ఆర్డీవో వెంకారెడ్డి, ట్రాఫిక్‌ ఏసీపీ సుధాకర్‌ పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...