వృద్ధులను నిర్లక్ష్యం చేయొద్దు


Sun,June 16, 2019 03:30 AM

నర్సంపేట, నమస్తేతెలంగాణ : వృద్ధులను నిర్ల క్ష్యం చేయవద్దని, వారి సంక్షేమానికి కృషి చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరా రు. ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవం సందర్భంగా శనివారం నర్సంపేటలో సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంరక్షించే బాధ్యత పిల్లలపై ఉందన్నారు. చిన్నతనంలో పిల్లలను తల్లిదండ్రులు బాధ్యతతో పెంచుతారన్నారు. అయినా కొందరు తల్లిదండ్రులను మరిచిపోవడం దురదృష్టకరమన్నారు. ప్రతీ ఒక్కరూ తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని కోరారు. నేటి సమాజంలో చాలా మంది వృద్ధులు నిరాధరణకు గురవుతున్నారన్నారు. కొందరు వృద్ధులు తినడానికి తిండికూడా దొరకని పరిస్థితిలో ఉన్నారన్నారు. ప్రతీ కుటుంబం కూడా తల్లిదండ్రులను గౌరవిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. కుమారులు పోషించడం లేదని ఎంతో మంది వృద్ధులు పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ప్రతీ ఇంటిలో వృద్ధులు ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుందన్నారు. అనంతరం సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ డివిజన్‌ అధ్యక్షుడు ఎర్ర జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం నుంచి అంబేద్కర్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నర్సంపేట మున్సిపల్‌ చైర్మన్‌ నాగెల్లి వెంకటనారాయణగౌడ్‌, వైస్‌ చైర్మన్‌ మునిగాల పద్మ వెంకట్‌రెడ్డి, డాక్టర్‌ ఉపేందర్‌రావు, నల్లా మనోహర్‌రెడ్డి, నాయిని నర్స య్య, మందుల శ్రీనివాస్‌, ఎంవీ రామారావు, తాళ్లపెల్లి యాకయ్య, మల్లయ్య, వీరయ్య, యాకయ్య, కరుణ, సరోజన, సత్తయ్య, బుచ్చయ్య, సుధాకర్‌, స్వామి తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...