రైతుకు అండగా ప్రభుత్వం


Sun,June 16, 2019 03:30 AM

-అన్నదాతకు పెద్ద పీట వేసిన సీఎం కేసీఆర్‌
-పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
-నియోజకవర్గ వ్యవసాయ అధికారులతో సమీక్ష
పరకాల, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉండి వారి అభివృద్ధికి పెద్దపీట వేసిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శనివారం నియోజకవర్గంలోని అన్ని మండలాల వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే ధర్మారెడ్డి హన్మకొండలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతిగా వారి సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తున్నారన్నారు. రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతుల ఇళ్ల వద్దకే అధికారులు వెళ్లి రైతుబంధు సాయం అందేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో రైతులకు కనీసం యూరి యా బస్తాలు కూడా దొరికేవి కావని, ప్రస్తుతం రాష్ట్రంలోని రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉన్నా యన్నారు. రైతు సమన్వయ సమితిలు ఏర్పాటు చేసి వారికి అండగా కేసీఆర్‌ నిలిచారని చెప్పారు. ఇప్పటికే మూడు విడతలుగా రైతులకు రైతుబంధు సహాయం అందించినట్లు తెలిపారు. దేశ చరిత్రలో ఎన్నడు, ఎక్కడాలేని విధంగా రైతు బీమా ప్రవేశపెట్టి ఏదైనా కారణంతో రైతు మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.5లక్షలు ఇస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా పరకాల నియోజకవర్గంలో ఏప్రిల్‌ 14 నుంచి జూన్‌ 14 వరకు రైతు సమగ్ర సర్వే జరిగిందని, ఇది 80 శాతం పూర్తయిందన్నారు.

మిగతా 20 శాతం సర్వేను త్వరగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే వ్యవసాయ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో 55121 మంది రైతులు ఉన్నారని, వివిధ కారణాలతో మృతిచెందిన 110 మంది రైతులకు బీమా కింద రూ.5.50కోట్లు చెల్లించినట్లు తెలిపారు. అలాగే, రైతుబంధు పథకం ద్వారా 1,06,953 ఎకరాలకు రూ.53.49 కోట్లు నేరుగా రైతు ఖాతాలో జమ చేసినట్లు ఎమ్మెల్యే ధర్మారెడ్డి వివరించారు. నకిలీ విత్తనాల బెడద ఉండొద్దనే లక్ష్యంతో ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వం మండల వ్యవసాయ అధికారితో పాటు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ను సమన్వయకర్తలుగా నియమించి, అన్ని విత్తన విక్రయ కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే రైతులకు కావల్సిన సబ్సిడీ విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచినట్లు వివరించారు. భూసాంద్రత పరీక్షలు చేయించి, ఏ పంట వేయాలో, ఎలాంటి ఎరువులు వాడాలో రైతులకు వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది సూచనలు చేయాలని ఆదేశించారు. రాగి, సామకర్ర, ఊదాలు, ఆంద్రుకొర్రలు, పచ్చజొన్న, తెల్లజొన్న, సజ్జల విత్తనాలు 65శాతం సబ్సిడీతో వ్యవసాయ శాఖ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. కార్యక్రమంలో పరకాల ఏడీఏ విద్యాసాగర్‌, ఏవోలు శ్రీనివాస్‌, హరిప్రసాద్‌బాబు, యాకయ్య, శ్వేత, యాదగిరి పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...