హన్మకొండ ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు


Sun,June 16, 2019 03:29 AM

- 229 సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల
పోచమ్మమైదాన్‌, జూన్‌ 15: వరంగల్‌ ములుగు రోడ్డులోని ప్రభుత్వ హన్మకొండ ఐటీఐలో సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ సక్రు నాయక్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2019-2020 సంవత్సరానికి గాను అర్హత పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలను iti.telangana.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచిం చారు. పదోతరగతి పూర్తి చేసిన అభ్యర్థులు తమకు నచ్చిన కళాశాల, ట్రేడ్‌లను ఎంపిక చేసుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 17 నుంచి 26 వరకు దరఖాస్తుల స్వీకరణ, 20 నుంచి 27 వరకు కేటాయించిన ఐటీఐ సెంటర్లలో ఓరిజినల్‌ సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని వివరించారు. 28న దివ్యాంగులకు హైదరాబాద్‌, వరంగల్‌ ఆర్‌డీడీ కార్యాలయాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాగా హన్మకొండ ప్రభుత్వ ఐటీఐలో ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌లో 52 సీట్లు, డ్రాఫ్ట్‌మెన్‌ సివిల్‌లో 26 సీట్లు, వెల్డర్‌లో 21 సీట్లు, కోపాలో 52 సీట్లు, స్టెనోగ్రఫీలో 52 సీట్లు, ఇన్ట్స్రూమెంట్‌ మెకానిక్‌లో 26 చొప్పున సీట్లు భర్తీ చేయను న్నట్లు వివరించారు. ఇందులో 20శాతం సీట్లు ఇన్‌స్టిట్యూట్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఐఎంసీ) కోటాలో పేమెంట్‌ కింద భర్తీ చేస్తామని తెలిపారు. ఈ కోటాల్లో ఎంపికైన విద్యార్థులు ఒక విద్యా సంవత్సరానికి రూ.10వేలు చెల్లించాల్సి ఉంటుందని, ఇదీ కూడా ఆన్‌లైన్‌లో చేయాలని ఆయన పేర్కొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...