ఇద్దరు అంతర్‌ జిల్లా దొంగల అరెస్టు


Sun,June 16, 2019 03:29 AM

-12 తులాల బంగారం, కిలో వెండి స్వాధీనం
-మానుకోట ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వెల్లడి
మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ: దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌ జిల్లా నేరస్తులు ఇద్దరిని మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ బంగ్లాలో అరెస్టు చేసినట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. శనివారం మహబూబాబాద్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ లో విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామానికి చెందిన దాసరి మురళీకృష్ణ, కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామానికి చెందిన రాగ దుర్గాప్రసాద్‌, మరో ఆరుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా పెట్టుకొని రాత్రి సమయంలో తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారని అన్నారు. నిద్రపోతున్న వ్యక్తుల మెడలో ఆభరణాలు లాక్కొని పారిపోయేవారన్నారు. శనివా రం మరిపెడ బంగ్లా రాజీవ్‌గాంధీ సెంటర్‌లో తనిఖీ చేస్తుండగా మురళి, దుర్గాప్ర సాద్‌ పోలీసులను చూసి బైక్‌పై పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నా మని అన్నారు. వీరి నుంచి బైక్‌, 12 తులాల బంగారం, కిలోవెండి స్వాధీనం చేసుకు న్నట్లు చెప్పారు. మహబూబాబాద్‌, వరంగల్‌ కమిషనరేట్‌ పరిధి, రాచకొండ పరిధి, నల్గొండ జిల్లాలో దొంగతనాలు చేసినట్లు రుజువైందన్నారు. దాసరి మురళీ కృష్ణ పీడీయాక్ట్‌లో జైలుకు వెళ్లి ఫిబ్రవరిలో తిరిగి వచ్చి తన పద్దతి మార్చుకో లేదన్నారు. రాగ దుర్గాప్రసాద్‌ జల్సాలకు అలవాటు స్నేహితులైన దాసరి మురళి, దాసరి ఎల్లయ్యతో కలిసి వివిధ ప్రాంతాలలో 9 దొంగతనాలకు పాల్పడ్డారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...